విడుదలైన అన్ని సెంటర్స్‌లో ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాకు మంచి వసూళ్లు దక్కుతున్నాయని బన్నీ వాస్, వంశీ నందిపాటి అన్నారు. ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేసిన వీరు ఈ సినిమా సక్సెస్‌పై సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బన్నీ వాస్ మాట్లాడుతూ ‘ఈ సినిమా మేము ఊహించినదానికంటే పెద్ద విజయాన్ని సాధిస్తోంది.
ఇప్పటిదాకా మొత్తం రూ.7.28 కోట్లు కలెక్షన్స్ రాగా, కేవలం నైజాం నుంచే రూ.5 కోట్ల 2లక్షలు వసూలు అయ్యాయి. ఆదివారం ఒక్కరోజు రూ.2 కోట్ల 17 లక్షలు కలెక్షన్స్ వచ్చాయి. తెలంగాణ స్టేట్‌లోని మల్టీప్లెక్స్‌ల కంటే సింగిల్ స్క్రీన్స్ నుంచే ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి. ఏపీ, సీడెడ్‌లోనూ డీసెంట్ కలెక్షన్స్ వస్తున్నాయి. ఐ బొమ్మ క్లోజ్ అవడం, 99 రూపాయలు టికెట్ రేట్ పెట్టడం మాకు కలిసొచ్చింది. సి సెంటర్స్‌లోనూ బాగా వసూళ్లు రావడం ఈ సినిమా ఎంత బాగా జనాల్లోకి వెళ్లిందో ప్రూవ్ చేస్తోంది. రూ. 50 కోట్లు వసూళ్లు చేసినా ఆశ్చర్యం లేదు’ అని అన్నారు. వంశీ నందిపాటి మాట్లాడుతూ ‘ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి వస్తోన్న రెస్పాన్స్ చూసి మరిన్ని స్ర్కీన్స్ యాడ్ చేశాం. మేము పెట్టిన పెట్టుబడికి నాలుగు రెట్ల లాభాన్ని ఈ మూవీ ఇస్తుందని ఆశిస్తున్నాం’ అని అన్నారు.
