ప్రొడ్యూసర్ బన్నీవాసు ఇంటర్య్వూ

ప్రొడ్యూసర్ బన్నీవాసు ఇంటర్య్వూ

అల్లు అర్జున్‌కి స్నేహితుడిగా పరిచయమైన బన్నీ వాసు.. ఆ తర్వాత గీతాఆర్ట్స్ 2 బ్యానర్‌‌‌‌ స్టార్ట్‌‌ చేసి ప్రొడ్యూసర్​గా సక్సెస్‌‌ సాధించారు. ఈ రోజు తన పుట్టిన రోజు కావడంతో ప్రస్తుతం నిర్మిస్తున్న సినిమాల గురించి, ఇండస్ట్రీ గురించి కాసేపు ఇలా కబుర్లు చెప్పారు.

‘‘కరోనా తర్వాత పెద్ద సినిమాలన్నీ ఒక వేవ్‌‌లా వచ్చాయి. ఇప్పుడు మీడియమ్ బడ్జెట్‌‌ సినిమాలకు లైన్ క్లియరయ్యింది. రెండు, మూడేళ్ల క్రితం మా బ్యానర్‌‌‌‌లో మొదలుపెట్టిన అన్ని సినిమాల రిలీజ్‌‌కీ ప్లాన్ చేస్తున్నాం. వాటిలో మొదటిగా ‘పక్కా కమర్షియల్’ రిలీజవుతోంది. నిఖిల్ ‘18 పేజెస్’ని సెప్టెంబర్ 10కి అనుకుంటున్నాం. నిఖిల్ మరో మూవీ ‘కార్తికేయ 2’ జులై 22న విడుదలవుతోంది కాబట్టి యాభై రోజుల గ్యాప్‌‌తో ఈ సినిమా వస్తే బాగుంటుందనుకున్నాం. కిరణ్ అబ్బవరం ‘వినరో భాగ్యము విష్ణుకథ’ని అక్టోబర్ 30కి తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నాం. వీటితో పాటు అల్లు శిరీష్ హీరోగా కొత్త బ్యానర్‌‌‌‌తో కలిసి ఓ మూవీ రూపొందిస్తున్నాం. దీన్ని ఆగస్టులో రిలీజ్ చేయాలనుకుంటున్నాం. అలాగే చందు మొండేటి డైరెక్షన్‌‌లో శ్రీకాకుళంలో జరిగిన రియల్ స్టోరీ ఆధారంగా ఓ సినిమా చేయనున్నాం. పవన్ సాధినేని స్క్రిప్ట్‌‌ రెడీ చేస్తున్నాడు. ‘పుష్ప2’ తర్వాత  గీతా ఆర్ట్స్‌‌ బ్యానర్‌‌‌‌లోనే అల్లు అర్జున్ మూవీ ఒకటుంది. తనతో చాలా ప్లాన్ చేస్తున్నాం. నిజానికి ‘పుష్ప’ రెండు పార్టులు అనుకోలేదు. అందుకే అప్పుడు కొందరు డైరెక్టర్స్‌‌తో సినిమాలు అనుకున్నాం. కానీ రెండు భాగాలయ్యాక ప్లాన్స్ మారిపోయాయి. దీంతో కమిట్‌‌మెంట్ ఇచ్చిన డైరెక్టర్స్‌‌ని హోల్డ్ చేయడం కరెక్ట్ కాదనుకున్నాం. వచ్చే యేడు సమ్మర్‌‌‌‌కి ‘పుష్ప2’ వస్తుందని భావిస్తున్నాం. ఆ తర్వాత ఎలాంటి స్ర్కిప్ట్ తీసుకోవాలి, ఎవరితో చేయాలనేది డిస్కస్ చేస్తున్నారు. కొత్త ప్రాజెక్ట్ గురించి  దసరాకి అఫీషియల్ అనౌన్స్‌‌మెంట్ వస్తుంది. అన్‌‌స్టాపబుల్ షోతో అరవింద్ గారికి, బాలకృష్ణగారికి మధ్య రిలేషన్‌‌షిప్‌‌ పెరిగింది. మంచి సబ్జెక్ట్‌‌ వస్తే ఆయనతో మూవీ చేయడానికి రెడీ. థియేటర్ రిలీజ్ తర్వాత సినిమా ఓటీటీకి వచ్చే విషయంలో ప్రొడ్యూసర్స్ మధ్య డిస్కషన్ జరుగుతోంది. రెండు, మూడు వారాల్లో ఓటీటీకి రావడం థియేటర్స్‌కు కష్టంగా మారుతోంది. అందుకే  నార్త్‌‌లో మినిమమ్ ఎనిమిది వారాల తర్వాత వచ్చేలా రూల్ తెచ్చారు. ఆడియెన్స్‌‌ని థియేటర్స్‌‌కి రప్పించడం చాలా అవసరం. అయితే గ్రాస్ కోసం ప్రతి మూవీకీ టికెట్ రేట్లు పెంచడం కరెక్ట్ కాదు. అలా పెంచితే నష్టపోయేది ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లే. అందుకే మా సినిమాలన్నింటి రేట్లూ ప్రేక్షకులకు అందుబాటులో ఉండేలా చూసుకుంటాం.  కరోనా తర్వాత ఆడియెన్స్ సినిమాలు చూసే విధానంలో మార్పులొచ్చాయి. ఎక్స్‌‌ట్రార్డినరీ సబ్జెక్టులనే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. వాళ్లందరినీ ఎంటర్‌‌‌‌టైన్ చేయడమే మా టార్గెట్.’’