రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) జంటగా వచ్చిన లేటెస్ట్ మూవీ ది ఫ్యామిలీ స్టార్(The Family star). టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ పరశురామ్ పేట్ల(Parasuram petla) తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు(Dil Raju) నిర్మించారు. టీజర్, సాంగ్స్, ట్రైలర్ తో అంచనాలు పెంచిన ఈ సినిమా నేడు ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి బాగా రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఫ్యామిలీ స్టార్ చిత్ర యూనిట్ కు మహిళా ప్రేక్షకులు సినిమా టీమ్ మెంబర్స్ ను సత్కరించారు.ఈ సక్సెస్ మీట్ లో ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాపై ఆడియన్స్ నుంచి వస్తోన్న స్పందన ఎలా ఉందో తెలిపారు.
ఆయన మాటల్లోనే.."మార్నింగ్ నాలుగు గంటల నుంచే యూఎస్ నుంచి మెసేజ్ స్ రావడం మొదలైంది. ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా థియేటర్స్ కు వెళ్తున్నారని..సినిమాని బాగా ఎంజాయ్ చేస్తున్నట్లు చెప్పారు. ఆ తర్వాత హైదరాబాద్ లో మార్నింగ్ 7:30 కి షోస్ మొదలయ్యాయి. నేను కూకట్ పల్లి భ్రమరాంబ థియేటర్లో సినిమా చూశా, అక్కడ 90 పర్సెంట్ యూత్ ఆడియన్స్ థియేటర్ లో ఉన్నారు. సినిమా మొదలైన 20 నిమిషాల వరకు ప్రేక్షకులు సైలెంట్ గా ఉన్నారని, హీరోయిన్ మృణాల్ ఎంట్రీ నుంచి మంచి రెస్పాన్స్ మొదలైందన్నారు.
మొత్తంగా ఫ్యామిలీ స్టార్ సినిమా మేము టార్గెట్ చేసిన ఫ్యామిలీ ఆడియెన్స్ కు బాగా రీచ్ అయ్యింది, ఫ్యామిలీ ఆడియెన్స్ క్రౌడ్స్ గా థియేటర్స్ కి వెళ్తున్నారు. అయితే, మీడియా నుంచి వచ్చిన రివ్యూస్ ఒకలా ఉన్నాయి, సినిమా చూసిన ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ వేరుగా ఉంది. వాళ్లలో 90 పర్సెంట్ మందికి ఫ్యామిలీ స్టార్ బాగా నచ్చింది, అందుకే సినిమా చూసిన ఫ్యామిలీ ఆడియెన్స్ మా టీమ్ కు సత్కారం చేస్తామంటే అందుకు సంతోషంగా ఒప్పుకుని రమ్మని చెప్పామని అన్నారు.
అలాగే, మేము ఇచ్చే స్టేట్ మెంట్స్ ను మీడియాలో ఎలా యాక్సెప్ట్ చేస్తుందో వాళ్లు రివ్యూస్ లో ఇచ్చే స్టేట్ మెంట్స్ ను మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం, మీడియా షో చూశాక నాతో టచ్ లో ఉండే మీడియా ఫ్రెండ్స్ ఫోన్ చేసి ఫ్యామిలీతో ఫ్యామిలీ స్టార్ సినిమా చూసి బాగా ఎంజాయ్ చేశామని చెప్పారు.
మేము సినిమాలో బామ్మకు మనవడికి మధ్య చూపించిన ఎమోషన్, ఇంట్లో బాబాయ్, పిల్లలు, అన్నాదమ్ముల మధ్య చూపించిన ఎమోషన్ ప్రేక్షకులకు బాగా నచ్చుతోంది అన్నారు. ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ సినిమా చూడండి. మాకు ఎలాంటి ఫీడ్ బ్యాక్ వచ్చిందో మీరూ అలాగే ఫీలవుతారని అన్నారు. ఈ సమ్మర్ లో ఫ్యామిలీ స్టార్ ను ఎంజాయ్ చేయండి అంటూ దిల్ రాజు అభిప్రాయం వ్యక్తం చేశారు.