
రమణ్, వర్షా విశ్వనాథ్ జంటగా రామచంద్ర వట్టికూటి తెరకెక్కించిన చిత్రం ‘మటన్ సూప్’. మల్లిఖార్జున ఎలికా (గోపాల్), రామకృష్ణ సనపల, అరుణ్ చంద్ర వట్టికూటి నిర్మించారు. అక్టోబర్ 10న విడుదలైన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోందని నిర్మాతలు తెలియజేశారు. ఈ సందర్భంగా నిర్మాతల్లో ఒకరైన గోపాల్ మాట్లాడుతూ ‘ఈ మూవీకి ముందుగా నేను కో డైరెక్టర్‌గా వచ్చా. తర్వాత రామచంద్ర ప్యాషన్ చూసి నిర్మించేందుకు ముందుకొచ్చా.
అందరికి తెలిసిన రియల్ ఇన్సిడెంట్‌నే మేం కొత్తగా చూపించాం. స్క్రీన్‌ప్లేతో అందరినీ మ్యాజిక్ చేశాం. రమణ్, వర్షా విశ్వనాథ్‌తోపాటు జెమిని సురేష్, గోవింద్ శ్రీనివాస్, శివరాజ్ సహా నటీనటులంతా బాగా సపోర్ట్ చేశారు. అలాగే ఈ సినిమాకు టెక్నికల్ టీం స్ట్రాంగ్ పిల్లర్‌లా నిలబడింది. వెంకీ వీణ పాటలు, ఆర్ఆర్ సినిమాకు ప్రధాన బలమైంది.
భరద్వాజ్, ఫణింద్ర విజువల్స్‌కు మంచి పేరు వచ్చింది. ఈ చిత్రానికి మేం ఊహించినట్టుగానే మంచి ఆదరణ దక్కుతోంది. ఆడియెన్స్ రియాక్షన్స్ చూస్తుంటే మేం ఇన్నేళ్లు పడ్డ కష్టాన్ని మర్చిపోయాం. ఇక నేను దర్శకుడిగా ఆల్రెడీ ఓ హారర్ మూవీ స్టార్ట్ చేశా. అలాగే నిర్మాతగానూ మరిన్ని చిత్రాలు నిర్మిస్తాను’ అని చెప్పారు.