
మ్యాన్ అఫ్ మాసెస్ ఎన్టీఆర్(Ntr) ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమా దేవర(Devara). స్టార్ డైరెక్టర్ కొరటాల శివ(Koratala Siva) తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకు లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ అందించబోయే సంగీతంపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ భారీ లెవల్లో అంచనాలు పెట్టేసుకున్నారు.
ఇప్పటికే ఫియర్ సాంగ్ మోగించే మోతకు బాక్సులు ధడేల్ అన్నాయి. రాకే ఎగబడి రాక్..దూకే ధైర్యమా జాగ్రత్త అంటూనే భయం పుట్టించిన దేవర నుండి కూల్ చేసే రొమాంటిక్ సాంగ్ రాబోతుంది.అవును..మీరు విన్నదే నిజమే..దేవర నుండి సెకండ్ సింగిల్ మరో రెండు రోజుల్లో రానుంది. ఇదివరకే ఈ సాంగ్ అప్డేట్ రానుందంటూ మ్యూజిక్ డైరెక్టర్ ట్వీట్ చేయగా..ప్రొడ్యూసర్ నాగవంశీ తన ‘X’ ఖాతాలో కూడా ట్వీట్ ద్వారా అప్డేట్ ఇచ్చాడు.
anna @tarak9999 ni ila cute chusi 6 years ayindhi kada ... malli aa cute ga smile chesthu romance cheyatam chustharu ee sari... Manaki ade saripothundhi kada? ? pic.twitter.com/vT5jAnCu9r
— Naga Vamsi (@vamsi84) July 31, 2024
ఆ ట్వీట్ లో ఏముందంటే "తారక్ అన్నని లవర్ బాయ్గా చూసి 6 సంవత్సరాలు అయింది కదా. మళ్లీ క్యూట్గా నవ్వుతూ రొమాన్స్ చేయడం చూస్తారు ఈ సారి. ఫ్యాన్స్ కి అది సరిపోతుంది కదా అని స్మైలింగ్ ఎమోజిని చూపిస్తూ అరవింద సమేతలోని పాటకు సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు. దీంతో దేవర సెకండ్ సింగిల్ లవ్ రొమాంటిక్ రానుందని ఈ తాజా అప్డేట్తో క్లారిటీ వచ్చింది.అయితే,ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ను సితార నాగవంశీ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే
#Devara ???
— Anirudh Ravichander (@anirudhofficial) July 30, 2024
నిజానికి దేవరకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు అని తెలిసినప్పటినుండి ఈ సినిమా రేంజ్ మారిపోయింది. కారణం.. అనిరుధ్ నుండి వచ్చిన గత చిత్రాలే. ఆయన మ్యూజిక్ అందించిన విక్రమ్, లియో, జైలర్ సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేశాయి. అందుకే.. దేవర కోసం అనిరుధ్ అందించబోయే మ్యూజిక్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.