Yatra2 Movie: యాత్ర 2 సెన్సార్ ఆపాలి..బోర్డుకు నిర్మాత నట్టి కుమార్ లేఖ

Yatra2 Movie: యాత్ర 2 సెన్సార్ ఆపాలి..బోర్డుకు నిర్మాత నట్టి కుమార్ లేఖ

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి,దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రాజకీయ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మూవీ యాత్ర. మహి వి రాఘవ్ తెరెకక్కించిన ఈ సినిమా 2019లో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. దానికి సీక్వెల్ గా యాత్ర 2 తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

వైఎస్ మరణాంతరం ఆయన కుమారుడు జగన్మోహన్‌ రెడ్డి పొలిటికల్ జర్నీ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో వై ఎస్ జగన్ పాత్రలో కోలీవుడ్ హీరో జీవా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్లు, టీజర్ సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేశాయి. మహి వి. రాఘవ్‌ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీ వచ్చే నెల ఫిబ్రవరి 8న థియేటర్లో రిలీజ్ కానుందని మేకర్స్ ప్రకటించారు.

తాజాగా ప్రముఖ సినీనిర్మాత, ఫిలిం డిస్ట్రిబ్యూటర్‌ నట్టికుమార్( Natti Kumar) యాత్ర 2 సెన్సార్ నిలివేయాలంటూ CBFC కి లేఖ రాశారు. లోక్‌సభ ఎలక్షన్స్ తర్వాతే యాత్ర 2 సెన్సార్   చేయాలని సెన్సార్ బోర్డును కోరారు. ఈ మేరకు సోమవారం ఆయన సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ చైర్ పర్సన్, సీఈఓ, హైదరాబాద్ రీజినల్ సెన్సార్ ఆఫీసర్ కు లేఖ రాశారు.

అలాగే సెన్సార్ చేయకుండానే ఈ సినిమా రిలీజ్ డేట్ ని ఎలా ప్రకటిస్తారని లేఖలో తెలిపారు. CBFC గైడ్ లైన్స్ ప్రకారం..సెన్సార్ జరపకుండా ముందుగా సినిమా రిలీజ్ డేట్    ప్రకటించడం నిబంధనలకు విరుద్ధమన్నారు. దీనిపై కూడా సెన్సార్ అధికారులు చర్యలు తీసుకోవాలని నట్టి కుమార్‌ లేఖలో కోరారు.

14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న తెదేపా అధినేత చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా ఉందని..అలాగే కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకురాలు సోనియాగాంధీన తప్పుగా చూపించారని..అందువల్ల, సినిమా రిలీజైతే ఓటర్లపై తప్పకుండ ప్రభావం చూపుతుందన్నారు. మరి సెన్సార్ వాళ్ళు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.