‘నిలవే’ చిత్రంతో టాలీవుడ్‌కు నిర్మాతగా పరిచయమైన రాజ్ అల్లాడ ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ప్రకటించిన 2026–-2028 కాలానికి నూతన కార్యవర్గంలో ఆయనకు ఈ కీలక బాధ్యతలు అప్పగించారు. టెక్నాలజీ రంగంలో అనుభవజ్ఞుడైన రాజ్ అల్లాడ 2009 నుంచి నాట్స్‌లో వాలంటీర్‌గా సేవలందిస్తూ సంస్థ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పుడు నాట్స్ అధ్యక్షుడిగా ఆయన నాయకత్వంలో సంస్థ మరింత విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపట్టి, తెలుగు సమాజానికి మరింత చేరువ అవుతుందనే ఆశాభావాన్ని సభ్యులు వ్యక్తం చేస్తున్నారు.
