టైటానిక్, అవతార్ ప్రొడ్యూసర్ ఇకలేరు

టైటానిక్, అవతార్ ప్రొడ్యూసర్ ఇకలేరు
  • లాస్ ఏంజిలిస్​లో కన్నుమూసిన జాన్  లాండావ్

న్యూయార్క్: టైటానిక్, అవతార్  బ్లాక్ బ్లస్టర్  సినిమాల నిర్మాత జాన్  లాండావ్  (63) కన్నుమూశారు. శుక్రవారం లాస్ ఏంజిలిస్​లో జాన్  చనిపోయారని ఆయన కొడుకు జామీ లాండావ్  తెలిపారు. టైటానిక్, అవతార్  సినిమాల డైరెక్టర్  జేమ్స్  కామెరాన్​కు జాన్  దీర్ఘకాలం పాటు నిర్మాతగా వ్యవహరించారు. 1960 జులై 23న న్యూయార్క్​లో జాన్  జన్మించారు. 

ఆయన తల్లిదండ్రులు ఏలి లాండావ్, ఎడీ లాండావ్. మాన్ హటన్  మూవీ హౌసెస్​ను ఏలి, ఎడీ కొన్నారు. అనంతరం అమెరికన్  ఫిల్మ్  థియేటర్​ను స్థాపించి డజనుకుపైనే సినిమాలు నిర్మించారు. వాటిలో హిట్  మూవీస్  లాంగ్ డేస్ జర్నీ ఇంటు నైట్ (1962), ద పాన్ బ్రోకర్ (1965), ద ఐస్ మ్యాన్  కామెత్ (1973), ద చూసెన్ (1981) సినిమాలు ఉన్నాయి. ఇక జాన్ లాండావ్  1987లో పారమౌంట్  క్యాంపస్  మూవీ నిర్మించారు. తర్వాత రెండు డిస్నీ సినిమాలకు సహ నిర్మాతగా వ్యవహరించారు.