మసూద విడుదలకు సిద్ధం

మసూద విడుదలకు సిద్ధం

మళ్లీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ చిత్రాలతో నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ యాదవ్ నిర్మించిన మూడో సినిమా ‘మసూద’.  సంగీత, తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్ లీడ్ రోల్స్‌‌లో నటించారు. సాయికిరణ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ  చిత్రాన్ని  నవంబర్ 18న దిల్ రాజు విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌‌మీట్‌‌లో ఆయన మాట్లాడుతూ ‘రాహుల్ యాదవ్ ఇంతకు ముందు తీసిన రెండు సినిమాలకు నేను అభిమానిని. అభిరుచిగల నిర్మాత. వాటితో కూడా కొత్త దర్శకులను, నటులను పరిచయం చేశాడు. ఆయన జర్నీ నచ్చి తర్వాత నిర్మించబోయే సినిమాను మా ద్వారా రిలీజ్ చేస్తానని మాటిచ్చాను. టీజర్ చాలా ఇంటరెస్టింగ్‌‌గా, ఎక్సయిటింగ్‌‌గా ఉంది. సినిమా సక్సెస్ అవ్వాలని కోరుతున్నా’ అన్నారు.

రాహుల్ మాట్లాడుతూ ‘కొత్త దర్శకులను ఐదుగురిని పరిచయం చేయాలనుకున్నాను. సాయికిరణ్‌‌ మూడో డైరెక్టర్.  దిల్ రాజు గారితో మరిన్ని మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నా’ అన్నారు. ఈ చిత్రంలో తమకు అవకాశం ఇచ్చినందుకు నిర్మాతకు నటీనటులు, దర్శకుడు థ్యాంక్స్ చెప్పారు.