
‘బేబీ’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వరుస కొత్త కథలతో సినిమాలు నిర్మిస్తున్నారు ఎస్‌కేఎన్. సోమవారం ఆయన పుట్టినరోజు సందర్భంగా.. ఆయన ప్రస్తుతం చేస్తోన్న మూవీస్ ప్రొగ్రెస్‌ను తెలియజేశారు. ‘‘ఈరోజుల్లో’ చిత్రంతో నిర్మాతగా మొదలుపెట్టిన నా జర్నీ ప్రస్తుతం సాఫీగా సాగుతోంది. జర్నలిస్ట్, పీఆర్ఓ, ప్రొడ్యూసర్.. ఇలా నా కెరీర్‌లోని ప్రతి దశను ఎంజాయ్ చేశాను. ప్రస్తుతం పెద్ద సినిమాలతో పాటు చిన్న చిత్రాలు కూడా చేస్తున్నా.
చిన్న చిత్రమైనా పెద్ద చిత్రమైనా కథ బాగుండాలి. ఎంత హంగామా చేసినా సినిమాలో కంటెంట్ లేకుంటే ప్రేక్షకులు థియేటర్స్‌కు రావడం లేదు. అందుకే నేను ఎక్సయిటింగ్ స్ర్కిప్ట్స్, స్ట్రాంగ్ కంటెంట్ ఉంటేనే సినిమాలు చేస్తాను. ప్రస్తుతం మా నిర్మాణంలో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. కిరణ్ అబ్బవరం హీరోగా ‘చెన్నై లవ్ స్టోరీ’ సెట్స్ మీద ఉంది. అలాగే కృష్ణ అనే ఒక టాలెంటెడ్ డైరెక్టర్‌ను ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఆ మూవీ పూజా ఈ నెలాఖరులో చేస్తాం. ఈ చిత్రంలో ఒక ఫేమ్ ఉన్న హీరోయిన్‌తో పాటు ఇద్దరు యంగ్ హీరోస్ ఉంటారు.
మరోవైపు ‘హరి హర వీరమల్లు’ మూవీకి వర్క్ చేసిన అవినాష్‌ను డైరెక్టర్‌గా పెట్టి కన్నడ లోని ఓ స్టార్ హీరో, మన తెలుగు నుంచి మిడ్ రేంజ్ హీరో కలిపి ఓ ప్రాజెక్ట్ ప్రొడ్యూస్ చేయబోతున్నాం. అలాగే ‘రాజా సాబ్’ తర్వాత మారుతితో ఒక సినిమా, సాయి రాజేశ్‌తో మరో సినిమా చేయబోతున్నాం. ఆహాలో ‘త్రీ రోజెస్’ సీజన్ 2 వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‌కు రెడీ అవుతోంది. వీటితో పాటు ‘బేబీ’ హిందీ రీమేక్ పనులు జరుగుతున్నాయి. వచ్చేనెల నుంచి షూటింగ్ ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నాం. ఇక హీరోయిన్స్‌తో పాటు వివిధ విభాగాల్లో తెలుగు వారికి ఎక్కువ అవశాకాలు ఇవ్వాలనుకుంటున్నా’ అని చెప్పారు.