ప్రభుత్వం జీవో 111 రద్దుతో జంట నగరాలకు వరద ముప్పు

ప్రభుత్వం జీవో 111 రద్దుతో జంట నగరాలకు వరద ముప్పు

ముషీరాబాద్, వెలుగు: హుస్సేన్ సాగర్, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్​లను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పర్యావరణవేత్త, ప్రొఫెసర్ దొంతి నరసింహారెడ్డి అన్నారు. చెరువులను పరిరక్షించుకోవాలన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆదివారం ‘‘సేవ్ హుస్సేన్ సాగర్.. సేవ్ హైదరాబాద్” నినాదంతో ట్యాంక్ బండ్​పై మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నరసింహారెడ్డి హాజరై, మాట్లాడారు. హుస్సేన్ సాగర్ కాలుష్యంతో ప్రమాదకారిగా మారిందన్నారు.

ప్రభుత్వం జీవో 111 రద్దుతో జంట నగరాలకు వరద ప్రమాదం పొంచి ఉందని, దీంతో ఆ జీవోను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. పర్యావరణవేత్త సాగర్ ధారా మాట్లాడుతూ, హుస్సేన్ సాగర్​ను కాలుష్య రహితంగా మార్చాల్సిన అవసరం ఉందన్నారు. సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి మాట్లాడుతూ, హైదరాబాద్ జిందాబాద్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ కోసం సదస్సులు, సెమినార్లు నిర్వహిస్తున్నామని చెప్పారు.