అంబేద్కర్ లేకుంటే రాజ్యాంగం లేదు : ప్రొఫెసర్ ​హరగోపాల్​

అంబేద్కర్ లేకుంటే రాజ్యాంగం లేదు : ప్రొఫెసర్ ​హరగోపాల్​

ఖైరతాబాద్​,వెలుగు: బీఆర్ అంబేద్కర్ పోరాటాలతోనే రాజ్యాంగంలో దళితులకు హక్కులు, న్యాయం దక్కాయని ప్రొఫెసర్​ హరగోపాల్​ పేర్కొన్నారు.  ఆయన లేకుంటే రాజ్యాంగం ఉండేది కాదని ఆయన అన్నారు.  ఆలిండియా ఎస్సీ, ఎస్టీ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆదివారం ఖైరతాబాద్​లోని విశ్వేశ్వరయ్య భవన్​లో  ఎస్సీ, ఎస్టీ, బీసీల సమస్యలపై జాతీయ సదస్సు జరిగింది. 

ముఖ్య అతిథిగా హాజరైన హరగోపాల్​ మాట్లాడుతూ  దేశానికి స్వాతంత్య్రం వస్తే  ప్రజలకు వచ్చినట్టు కాదన్నారు. ప్రతి విషయంలోనూ మహిళలు ముందుకు వచ్చి పోరాడాలని సూచించారు. విద్యతోనే అంబేద్కర్​ఉన్నతస్థాయికి ఎదిగారని, అందుకే ప్రతి ఒక్కరూ విద్యా అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.  అందరూ ఐక్యంగా ఉంటేనే హక్కులను సాధించుకోగలమని పేర్కొన్నారు.  సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎర్మాల శివరాజ్​ అధ్యక్షతన జరిగిన సదస్సులో పలు సంఘాల నేతలు పాల్గొని మాట్లాడారు.