ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థినులను వేధిస్తున్న ప్రొఫెసర్

ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థినులను వేధిస్తున్న ప్రొఫెసర్

విద్యార్ధులకు ఆదర్శంగా ఉండి…వారి ఉన్నతికి పాటు పడాల్సిన ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ వేధింపులకు పాల్పడుతున్నాడు. కరీంనగర్ లోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో ECE అసిస్టెంట్ ప్రొఫెసర్ పని చేస్తున్న సురేందర్ విద్యార్థినులను వేధిస్తున్నాడు. వాట్స్ అప్ లో అసభ్యకర పోస్టులు పెడుతూ వారిని తన రూంకు రావాలని, లేదంటే.. సంబంధిత సబ్జెక్ట్ లో ఫెయిల్ చేస్తానంటూ బెరింపులకు పాల్పడ్డాడు. సురేందర్ వెకిలిచేష్టలకు విద్యార్థినులు కొంతమంది చదువులను మానేసి కాలేజీకి రావడమే మానుకున్నారు. మరికొంత మంది స్టూడెంట్స్ వేధింపులపై యాజమాన్యానికి ఫిర్యాదులు చేస్తే ఎక్కడ తమ భవిష్యత్తు నాశనమవుతుందోనని చెప్పకుండా ఉండిపోయారు.

ప్రొఫెసర్ వేధింపులు రోజు రోజుకూ ఎక్కువ కావడంతో తట్టులేని కొందరు విద్యార్థునులు మీడియాను ఆశ్రయించడంతో విషయం బయటపడింది. విద్యార్థినులను వేధిస్తున్న ప్రొఫెసర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని… వెంటనే ఆయన్ని ఉద్యోగం నుంచి తొలిగించాలని కాలేజీ యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు.