రిలయన్స్ కు లాభాల పంట.. జియో ఒక్కదాన్లోనే 4 వేల కోట్ల ప్రాఫిట్

రిలయన్స్ కు లాభాల పంట.. జియో ఒక్కదాన్లోనే 4 వేల కోట్ల ప్రాఫిట్

డిసెంబర్‌తో ముగిసిన మూడో క్వార్టర్‌లో రిలయన్స్​ లాభం 13 వేల కోట్లు

రెవెన్యూ కూడా రూ. 1.2 లక్షల కోట్లకు పెరిగింది

పంట పండించిన డిజిటల్​

రిటెయిల్​ సేల్స్​ తగ్గాయ్​

ముంబై: దేశంలోనే అతి పెద్ద లిస్టెడ్​ కంపెనీ రిలయన్స్​ ఇండస్ట్రీస్​ లిమిటెడ్​ లాభం అంతకు ముందు ఏడాది మూడో క్వార్టర్​తో పోలిస్తే 12.5 శాతం పెరిగింది. ఎనలిస్టుల అంచనాలకు మించిన రిజల్ట్స్​ను రిలయన్స్​ శుక్రవారం ప్రకటించింది. డిసెంబర్​తో ముగిసిన మూడో క్వార్టర్​కు కంపెనీకి రూ. 13,101 కోట్ల లాభం వచ్చింది.

  •   ఆయిల్​ నుంచి టెలికం దాకా విస్తరించిన రిలయన్స్​ ఇండస్ట్రీస్​ లిమిటెడ్​ డిసెంబర్​, 2020 క్వార్టర్లో ఆదాయాన్ని కూడా 21.10 శాతం పెంచుకుంది. ఈ క్వార్టర్లో కంపెనీ రెవెన్యూ రూ. 1.2 లక్షల కోట్లకు చేరింది. రిఫైనింగ్​ బిజినెస్​ ఇంకా కష్టాలలో కొనసాగుతుండటం వల్లే టర్నోవర్​ ఇంకా పెరగలేదని రిలయన్స్​ ఇండస్ట్రీస్​ వెల్లడించింది. మరోవైపు రిలయన్స్​ ఇండస్ట్రీస్​ లిమిటెడ్​ రెవెన్యూ రూ. 1.27 లక్షల కోట్లు, లాభం రూ. 11,420 కోట్లు ఉండొచ్చని అంతకు ముందు ఎనలిస్టులు అంచనా వేశారు.
  • రిలయన్స్​ టర్నోవర్​లో మూడింట రెండు వంతులు రిఫైనింగ్​, పెట్రో కెమికల్​ బిజినెస్​ల నుంచే వస్తోంది. తాజా క్వార్టర్​లో ఈ రెవెన్యూ అంతకు ముందు ఏడాది ఇదే క్వార్టర్లోని రూ. 1.19 లక్షల కోట్ల నుంచి రూ. 83,338 కోట్లకు పడిపోయింది. కరోనాతో ఫ్యూయెల్​ డిమాండ్​ తగ్గిపోవడంతో ఆ ప్రభావం రిఫైనింగ్​ బిజినెస్​పై పడిందని కంపెనీ తెలిపింది.
  • డిజిటల్​ సర్వీసెస్​ రెవెన్యూ మాత్రం అంతకు ముందు ఏడాది డిసెంబర్​ క్వార్టర్​లోని రూ. 17,849 కోట్ల నుంచి డిసెంబర్​ 2020 క్వార్టర్లో రూ. 23,678 కోట్లకు పెరిగింది. లాభాల్లోనూ డిజిటల్​ సర్వీసెసే ముందుంది. కంపెనీ గ్రోత్​ను ఇదే నడిపిస్తోంది.
  • రిలయన్స్​ రిటెయిల్​ సేల్స్​ కూడా డిసెంబర్​ 2020 క్వార్టర్లో తగ్గాయి. అంతకు ముందు ఏడాది మూడో క్వార్టర్లోని సేల్స్​ రూ. 45,348 కోట్ల నుంచి తాజా క్వార్టర్లో రూ. 36,887 కోట్లకు పరిమితమయ్యాయి. అయితే రిటైల్ ఈబీఐటీడీఏ 53.9 శాతం పెరిగి రూ.3,087 కోట్లుగా ఉంది.

షేరు పడింది…

శుక్రవారం సాయంత్రం ఫైనాన్షియల్​ రిజల్ట్స్​ ప్రకటించనున్న నేపథ్యంలో ఎన్​ఎస్​ఈలో రిలయన్స్​ ఇండస్ట్రీస్​ షేర్లు 2.4 శాతం పతనమై రూ. 2,049.60 వద్ద ముగిశాయి.

ఇండియా ఎకానమీ రికవరీ బాటలో నడుస్తోంది. ఇందులో మేం కూడా భాగం పంచుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. డిసెంబర్​ 2020 క్వార్టర్లో కంపెనీ పనితీరు సంతృప్తి కలిగిస్తోంది. ఆయిల్​ టూ కెమికల్​ బిజినెస్​ కూడా మెరుగుపడుతోంది. ఈ నేపథ్యంలోనే మంచి ఆపరేషనల్​ రిజల్ట్స్​ ప్రకటించగలిగాం. డిజిటల్​ సర్వీసెస్​ బిజినెస్​ క్రమంగా గ్రోత్​ సాధిస్తోంది. మార్చి 2020 నుంచి కొత్తగా 50 వేల మందికి ఉద్యోగాలు కల్పించగలగడం గర్వంగా భావిస్తున్నాం. -ముకేశ్​ అంబానీ, ఛైర్మన్, ఎండీ, రిలయన్స్ ఇండస్ట్రీస్

జియో లాభం రూ.3,489 కోట్లు..

రిలయన్స్ ఇండస్ట్రీస్ సబ్సిడరీ రిలయన్స్ జియో కన్సాలిడేటెడ్ నికర లాభం రూ.3,489 కోట్లుగా రిపోర్ట్ చేసింది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఈ లాభం 15.5 శాతం పెరిగింది. సెప్టెంబర్ క్వార్టర్‌‌‌‌లో జియోకి రూ.2,844 కోట్ల నికర లాభం వచ్చింది. ఈ డిసెంబర్ క్వార్టర్‌‌‌‌లో కంపెనీకి ఒక్కో యూజర్‌‌‌‌పై వచ్చే యావరేజ్ రెవెన్యూ(ఆర్పూ) నెలకు రూ.151కు పెరిగింది. 2020 డిసెంబర్ 31 నాటికి రిలయన్స్ జియో మొత్తం కస్టమర్లు 41 కోట్లుగా ఉన్నారు. కరోనా సంబంధిత ఇబ్బందులున్నప్పటికీ ఈ క్వార్టర్లో కంపెనీకి 2.51 కోట్ల మంది కస్టమర్లు వచ్చారు.

ఇవి కూడా చదవండి

హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంక్‌‌కి కోటి ఫైన్

ఆస్ట్రేలియాతో గూగుల్​ కయ్యం

V6 రేటింగ్​పై కుట్ర.. రేటింగ్​ పెరగకుండా ప్రయత్నాలు