లాభదాయకమైన సాగు చేయాలి : కలెక్టర్ కుమార్ దీపక్

లాభదాయకమైన సాగు చేయాలి :  కలెక్టర్ కుమార్ దీపక్
  •     కలెక్టర్ కుమార్ దీపక్

నస్పూర్, వెలుగు: జిల్లాలోని రైతులందరు లాభదాయకమైన సాగు చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. శనివారం కలెక్టరేట్ లో డీఏవో సురేఖతో కలిసి ఏవోలు, ఏఈవోలతో యాసంగి 2025- –- 26 సీజన్ సాగుపై సమావేశం నిర్వహించారు. 

కలెక్టర్ మాట్లాడుతూ..యాసంగి సీజన్‌లో సుమారు లక్షా 43 వేల ఎకరాల్లో పంటలు సాగు చేసే అవకాశం ఉందన్నారు. ఇటీవల జిల్లాలో దెబ్బతిన్న పంటలపై ఏఈవోలు క్షేత్రస్థాయిలో పరిశీలించి పంట నష్టం నివేదికలను సమర్పించాలన్నారు. 

పంట సాగులో డ్రోన్ వినియోగంపై క్రాప్ క్రాఫ్ట్స్ ఇన్నోవేషన్స్ కంపెనీ ప్రతినిధులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. సాగులో డ్రోన్ల వినియోగం ద్వారా అధిక పంట దిగుబడి పొందవచ్చని రైతులకు అవగాహన కల్పించాలన్నారు. 

నిమోనియా నివారణకు ప్రత్యేక చర్యలు

జిల్లాలో నిమోనియా వ్యాధి నివారించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ కుమార్ దీపక్ చెప్పారు. కలెక్టర్ చాంబర్ లో డీఎంహెచ్​వో అనిత, ఏడీఎంహెచ్​వో సుధాకర్ నాయక్, ఆర్ఎస్ పద్మ, మాస్ మీడియా అధికారి వెంకటేశ్వర్లు తో కలిసి పోస్టర్లను ఆవిష్కరించారు. 

కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పీహెచ్​సీలు, ఆయుష్మాన్, ఉప కేంద్రాల్లో వైద్యులు, సిబ్బంది నిమోనియా రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.