ఆర్టీసీతో లాభాలు.. ప్రైవేటు ట్రాన్స్‌‌‌‌పోర్ట్‌‌‌‌తో నష్టాలు

ఆర్టీసీతో లాభాలు.. ప్రైవేటు ట్రాన్స్‌‌‌‌పోర్ట్‌‌‌‌తో నష్టాలు

ఆర్టీసీతో లాభాలు

సురక్షితమైన, నమ్మకైన అవాంతరాలు లేని ప్రయాణం. శిక్షణ పూర్తి చేసిన వారే డ్రైవర్లుగా ఉంటారు.
టికెట్​ ధర తక్కువ. చార్జీలపై సర్కారు నియంత్రణ.
జనాలున్నా లేకపోయినా సమయం ప్రకారం బస్సులు నడుస్తాయి.
స్టూడెంట్స్‌‌‌‌కు, వికలాంగులకు, జర్నలిస్టులకు బస్‌‌‌‌పాస్‌‌‌‌ సౌకర్యం.
సిటీలో రూ. 900తో నెలంతా ఆర్డినరీ, మెట్రోబస్సుల్లో ప్రయాణం.
రూ. 80తో 24 గంటల పాటు అన్ని సిటీ ఆర్డినరీ, మెట్రో బస్సుల్లో ప్రయాణించే టీ-24 టికెట్‌‌‌‌ సౌకర్యం.
ఆర్టీసీ ఆస్తులు ప్రజలు ఆస్తులే. నిజాంస్టేట్‌‌‌‌లో 32 బస్సులతో ప్రారంభమైన సంస్థ ఇప్పుడు రూ. 50వేల కోట్ల ఆస్తులకు పెరగడమంటే ప్రజాసంపద పెరగడమే. దీనిపై ప్రజలదే హక్కు.
గ్రామీణ ప్రాంత రైతులు పాలు, కూరగాయలువంటి ఉత్పత్తులను దాదాపు ఉచితంగానే సమీప ప్రాంతాలకు తరలించే అవకాశం.
మెట్రోరైలుపై పెట్టే ఖర్చులో 20శాతం ఆర్టీసీపై పెడ్తే మెట్రో కన్నా పదింతల మందికి  ప్రయాణ సౌకర్యం కల్పించవచ్చు.
దేశంలోనే అతితక్కువ యాక్సిడెంట్స్‌‌‌‌ అవార్డులు పొందిన సంస్థ ఆర్టీసీ. ఆర్టీసీ బస్సులో ప్రయాణికులు చనిపోతే బీమా సౌకర్యం ఉంటుంది.

ప్రైవేటు ట్రాన్స్‌‌‌‌పోర్ట్‌‌‌‌తో నష్టాలు

ప్రమాదకరమైన, నమ్మకంలేని అవాంతరాలతో కూడిన ప్రయాణం. పెద్దగా శిక్షణ లేనివారూ డైవర్లుగా ఉంటారు.
అత్యంత ఎక్కువ రేట్లు, నియంత్రణ లేని వివిధ రకాల టికెట్‌‌‌‌ ధరలు, మేనేజ్మెంట్ల ఇష్టారాజ్యం.
సమయపాలన ఉండదు. బస్సులు ప్రయాణికులు నిండేవరకూ వెయిట్‌‌‌‌ చేయాల్సిందే.
దీంట్లో ఎవ్వరికీ ఎలాంటి రాయితీ సౌకర్యం ఉండదు. ఆర్టీసీ లేకుంటే భారీ రేట్లు పెరిగే అవకాశం.
ప్రైవేటు ట్రాన్స్‌‌‌‌పోర్ట్‌‌‌‌లో నెలకు సుమారు రూ. 3వేల వరకూ ఖర్చు.
టీ 24 సౌకర్యం ఉండదు. రోజు కనీసం రూ.200 ఖర్చు చేయాల్సిందే.
ప్రైవేటు ట్రాన్స్‌‌‌‌పోర్ట్‌‌‌‌ మేనేజ్మెంట్స్‌‌‌‌ వ్యక్తిగత ఆస్తులు పెరిగి, అవి అనేక ఉల్లంఘనలకు పాల్పడి మాఫియాగా తయారయ్యే ప్రమాదం.
ప్రైవేటు ట్రాన్స్‌‌‌‌పోర్ట్‌‌‌‌లో లగేజీ తీసుకెళ్తే అదనపు డబ్బు చెల్లించాల్సిందే.
ట్రాన్స్‌‌‌‌పోర్ట్‌‌‌‌  ప్రైవేటీకరణలో భాగంగా మెట్రో రైలుకు వేల కోట్ల నిధులు కేటాయింపు.
ఎక్కువ యాక్సిడెంట్స్ ప్రైవేటు ట్రాన్స్‌‌‌‌పోర్టులోనే
ప్రయాణికులు చనిపోతే బీమా సౌకర్యం ఉండదు.