డో టర్మ్ లో రెట్టింపు వేగంతో డె వలప్ మెంట్
మాటల్ని చేతల్లో చూపిస్తున్నా మన్న మంత్రి జవదేకర్
5 ట్రిలియన్ డాలర్ ఎకానమీనే మెయి న్ టార్గెటని వెల్లడి
కేంద్రంలో రెండో సారి పవర్లోకి వచ్చి 50 రోజులు పూర్తైన సందర్భంగా మోడీ సర్కార్ ప్రోగ్రెస్ రిపోర్టు విడుదల చేసింది. దేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తయారుచేయడమే మెయిన్ టార్గెట్‌గా ముందుకెళుతున్నామని, అందులో భాగంగా లోక్‌సభ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీనీ అమలు చేస్తున్నామని కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. సోమవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన ‘మోడీ 50 రోజుల రిపోర్టు’ను వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల్లో 303 సీట్ల భారీ మెజార్టీతో నరేంద్ర మోడీ గత మే 30న రెండోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించడం తెలిసిందే.
టార్గెట్ 5 ట్రిలియన్..
ఇండియా 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మారడం కలగా మిగిలిపోదని, అందుకోసం పక్కాగా రోడ్‌మ్యాప్ సిద్ధం చేశామని జవదేకర్ చెప్పారు. ఫస్ట్ టర్మ్ పాలన కంటే సెకండ్ టర్మ్ మరింత ఎఫెక్టివ్‌గా ఉంటుందని గత 50 రోజుల్లోనే ప్రూవ్ అయిందన్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్, సోషల్ జస్టిస్, ఎడ్యుకేషన్ రంగాల్లో చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. వరల్డ్ ఫోరంలో ప్రధాని మోడీ కీలకంగా వ్యవహరిస్తుండటం వల్ల ప్రపంచ రాజకీయాలపై ఇండియా ప్రభావం ఇంకా పెరిగిందన్నారు. రోడ్లు, రైల్వే, పోర్టులు, ఎయిర్‌పోర్టులు ఇతర మౌలిక సదుపాయాల కోసం రూ. 100 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, జలశక్తి మినిస్ట్రీ ద్వారా 2024 నాటికి ఇంటింటికీ మంచి నీళ్లు సరఫరా చేస్తామని మంత్రి చెప్పారు. నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఏర్పాటును ప్రస్తావిస్తూ, దాని ద్వారా సంఘటిత, అసంఘటిత రంగాల్లోని కార్మికులకు, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధికి అవసరమైన సహాయాన్ని అందిస్తామని, తద్వారా ఉపాధి అవకాశాలు పెరిగి,
అన్ని వర్గాల సంక్షేమానికి దోహదపడుతుందన్నారు.
ఇవి చేశాం..
ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మొదటి 50 రోజుల్లో సాధించిన విజయాలను మంత్రి జవదేకర్ వివరించారు.
రైతులందరికీ రూ.6వేల పెట్టుబడి సాయం
పంటలకు కనీస మద్దతు ధరలు రెండింతలు
10వేలకుపైగా ఫార్మర్స్ ఆర్గనైజేషన్ల ఏర్పాటు
అసంఘటిత రంగంలోని 40 కోట్ల మంది కార్మికులకు న్యాయం దక్కేలా లేబర్ కోడ్‌లో సవరణలు
గవర్నమెంట్ సెక్టార్ రీక్యాపిటలైజేషన్ కోసం రూ.70వేల కోట్లు
స్టార్టప్‌ల కోసం ప్రత్యేక టీవీ చానెల్
జమ్మూకాశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొనేలా కొత్త చట్టాలు
సెక్యూరిటీ, పోలీస్ బలగాల్లో పనిచేస్తూ అమరులైన సిబ్బంది పిల్లలకు స్కాలర్షిప్స్ పెంపు
షాప్కీపర్లకు పెన్షన్ సదుపాయం
హోమ్ లోన్స్‌పై వడ్డీ తగ్గింపు
జీఎస్టీ సరళీకరణ
పోక్సో చట్టానికి సవరణలు
