ప్రభాస్ కల్కి 2898 AD గ్లింప్స్.. ఆ ధర్మాన్ని పాలిస్తున్న కలి ని చంపడానికేనా?

ప్రభాస్  కల్కి 2898 AD గ్లింప్స్.. ఆ ధర్మాన్ని పాలిస్తున్న కలి ని చంపడానికేనా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) కల్కి 2898 AD గ్లింప్స్ రావడంతో ప్రపంచం దద్దరిల్లింది. హాలీవుడ్ స్థాయిలో ఉన్న క్యారెక్టర్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజువల్స్, స్టోరీ థీమ్ ఇవన్నీ అభిమానుల్లో అంచనాలు పెంచేసాయి. రీసెంట్ గా రిలీజ్ అయినా ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ తో నిరాశ కలిగిన.. ఈ ఒక్క గ్లింప్స్ తో ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు.  కలియుగం అంతం అవుతుందని అనడంలో ప్రతి ఒక్కరి ఐడియాస్ వేరే.  

కల్కి 2898 బ్యాక్ డ్రాప్ అంటూ టైటిల్ వెనుక ఉన్న మీనింగ్ ను నాగ్ అశ్విన్(Nag Ashwin) మరో స్థాయిలో చూపించబోతున్నట్లు తెలుస్తుంది . ఆ ధర్మాన్ని పాలిస్తున్న కలి ని చంపడానికి శ్రీ మహా విష్ణువు తన దశ అవతారాల్లో చివరి కల్కి అవతారంలో ప్రభాస్ కనిపిస్తున్నట్లు అర్ధం అవుతోంది. కలియుగం చివర్లో  పాపం అనేది విపరీతంగా పెరిగిపోవటం వల్ల..మతం పేరుతో, కపటత్వం మాటున చాలా చోట్ల ప్రతిష్టంభన నెలకొంటుంది. అప్పుడు  కలి ని  సంహరించేందుకు కల్కి లా  ప్రభాస్ ఎంట్రీ ఇస్తారని అంటున్నారు.  దీనికి సైన్స్ ఫిక్షన్ ను జోడించి నాగ్ అశ్విన్ తనదైన క్రియేటివ్ మైండ్ తో మూవీను తీస్తున్నట్లు తెలుస్తోంది.  ఈ గ్లింప్స్ వీడియో లో ఉన్న కాళీ సైన్యంలోని  'O' రైడర్లు.. వారితో పోరాటం చేసే ప్రభాస్ స్వాగ్..ఎంతో క్యూరియాసిటీను అమాంతం పెంచేసింది. 

ఈ చిన్న వీడియోనే ఇలా ఉంటే..ఇక పూర్తి ప్రాజెక్ట్ K మూవీ ఏ స్థాయిలో ఉంటుందో అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ నటనకు..స్టామినాకు సరిపడే మూవీ ప్రాజెక్ట్ కల్కి అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో కామెంట్స్ తెలుపుతున్నారు. 

ఇక నుంచి హీరో ప్రభాస్ నటన హాలీవుడ్ రేంజ్ ను మించేలా ఉంటుందని సినీ క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు. ఈ మూవీను వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ దాదాపు రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో  ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బిగ్​ బీ అమితాబ్ బచ్చన్,  దీపికా పదుకొణె, దిశా పటానీ, కమల్ హాసన్..పలువురు స్టార్ కాస్ట్ ముఖ్య పాత్రలను పోషిస్తున్న సంగతి తెలిసిందే.