డ్రగ్స్‌ కేసులో ప్రముఖ నిర్మాత అరెస్ట్

డ్రగ్స్‌ కేసులో ప్రముఖ నిర్మాత అరెస్ట్

హైదరాబాద్‌లో డ్రగ్స్ వ్యవహారం మరోసారి కలకలం రేపింది. కబాలి(Kabali) చిత్ర నిర్మాత కేపీ చౌదరి(KP Chowdary) వద్ద నుండి పెద్దఎత్తున కొకైన్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇందులో భాగంగా ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

కేపీ చౌదరి కొంతకాలంగా గోవాలో ఉంటున్నాడని.. ఇటీవల హైదరాబాద్ కు వచ్చిన ఆయన వద్ద డ్రగ్స్ ఉన్నాయని సమాచారం రావడంతో పోలీస్ లు ఆయనపై రైడ్ చేశారు. ఈ రైడ్ లో ఆయన దగ్గర నుండి పెద్దఎత్తున కొకైన్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.