దేశానికి మరింత కీర్తి, ప్రతిష్టలు తీసుకొస్తా

దేశానికి మరింత కీర్తి, ప్రతిష్టలు తీసుకొస్తా

హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ

ముంబై: టీమిండియా హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ అరుదైన ఘనతను సాధించిన సంగతి తెలిసిందే. సచిన్, ధోని, కోహ్లీ తర్వాత భారత అత్యున్నత క్రీడా పురస్కారమైన ఖేల్‌ రత్నను రోహిత్ గెలుచుకున్నాడు. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా తనను అభిమానించే ఫాలోవర్స్, ఫ్యాన్స్‌కు హిట్‌మ్యాన్ మప్పిదాలు చెప్పాడు.

‘మీ వెల్‌ విషెస్‌, సపోర్ట్‌కు కృతజ్ఞతలు. ఇదో అద్భుతమైన ప్రయాణం. ఇండియా అత్యున్నత క్రీడా పురస్కారాన్ని గెల్చుకోవడంపై గర్వంగా ఉంది. నేను చాలా హ్యపీగా ఉన్నా. దీనికి నేను మీకు రుణపడి ఉంటా. మీ మద్దతు లేకుండా ఇది సాధ్యమయ్యేది కాదు. మీ సపోర్ట్‌ను ఇలాగే కొనసాగించండి. ఇండియాకు మరింత కీర్తి ప్రతిష్టలు తీసుకొస్తానని నేను మీకు ప్రామిస్‌ చేస్తున్నా. మనం సోషల్ డిస్టెన్సింగ్ చేస్తున్నాం కాబట్టి మీ అందరికీ ఓ వర్చువల్ హగ్’ అని రోహిత్ ట్విట్టర్‌‌లో తాను మాట్లాడిన వీడియోను పోస్ట్ చేశాడు.