
హైదరాబాద్, వెలుగు: ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శులకు సీనియారిటీని బట్టి గ్రేడ్4, 3, 2, 1 పదోన్నతులు కల్పించాలని పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్ సుధాకర్ ఆదేశించారు. ఈ మేరకు సోమవారం అన్ని జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వుల ప్రకారం గ్రేడ్ 1 పంచాయతీ కార్యదర్శులకు డివిజనల్ పంచాయతీ ఆఫీసర్ (డీఎల్పీవో)గా పదోన్నతి దక్కనుంది. ఇప్పటిదాకా ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పీఆర్డీగా ఉన్న పోస్టులను డీఎల్పీవోలుగా మార్చాలని సీఎం ఆదేశించారు. అందుకు తగ్గట్టు ప్రమోషన్లు రాబోతున్నాయి. కాగా, శాఖలో ఉన్న ఖాళీ పోస్టుల వివరాలు చెప్పాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో అధికారులు ఆ సంఖ్యను తేల్చారు.