ఆక్సిజన్ లెవల్స్ పెరగాలంటే ఈ టెక్నిక్ ఫాలో అవ్వాల్సిందే 

V6 Velugu Posted on May 04, 2021

న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ ఉధృతితో చాలా మందిలో అనేక అనుమానాలు నెలకొన్నాయి. కరోనా సోకి తగ్గినోళ్లు వ్యాక్సిన్ వేసుకోవచ్చొ? ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో లాభమెంత? యువతకే ఎందుకు సీరియస్ అవుతోంది? లాంటి ప్రశ్నలు గిర్రును తిరుగుతున్నాయి. ఈ క్రమంలో వాటికి ప్రముఖ డాక్టర్లు సమాధానాలు చెప్పారు. ఆక్సిజన్ పెరగాలంటే ప్రోనింగ్ చేయాల్సిందేనని సూచించారు. బోర్లా పడుకుంటే 6 నుంచి 8 శాతం వరకు ఆక్సిజన్ లెవల్ ఎక్కువవుతుందని చెప్పారు.

డాక్టర్లు, నిపుణులు చెబుతున్న మరికొన్ని సూచనలు: 

 •  ఆక్సిజన్ లెవల్స్ పడిపోయినట్లు అనిపిస్తే వెంటనే ప్రోనింగ్ (బోర్లా పడుకోవడం) చేయాలి. దాని వల్ల ఆక్సిజన్ లెవల్స్ పెరుగుతాయి. 
 •  ప్రోనింగ్ టెక్నిక్‌‌ వైద్యపరంగా ఆమోదించబడింది. బోర్లా పడుకొని కడుపుపై ఒత్తిడి తీసుకురావాలి. ఇలా చేయడం వల్ల శ్వాస తీసుకోవడంలో కలిగే ఇబ్బందులను అధిగమించొచ్చు. 
 •  శ్వాస తీసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నప్పుడు, ఆక్సిజన్ లెవల్స్ 94 కంటే కిందకు పడిపోయినప్పుడు మాత్రమే ప్రోనింగ్ చేయాలి. కరోనా పేషెంట్లకు ముఖ్యంగా హోం ఐసోలేషన్‌‌లో ఉన్నవారికి ఈ టెక్నిక్ బాగా హెల్ప్ అవుతుంది.

ప్రోనింగ్ చేసే విధానం: 

 •  బోర్లా పడుకొని మెడ కింద ఒక దిండును పెట్టుకోవాలి.
 •  ఛాతీ భాగానికి కింద తొడ పైభాగానికి అమరేలా ఒకటి లేదా రెండు తలగడలను ఉంచాలి.
 •  పాదాల కింద రెండు పిల్లోలను పెట్టాలి.
 •  నిద్రించే పొజిషన్‌లలో మార్పులు చేస్తూ ఉండాలి.
 •  ఏ పొజిషన్‌లో అయినా 30 నిమిషాలకు మించి ఉండకూడదు. 
 •  భోజనం చేసిన తర్వాత ఓ గంట వరకు ప్రోనింగ్ చేయకూడదు. 
 •  ఒక రోజులో 16 గంటల పాటు ప్రోనింగ్ చేయొచ్చు. 

ప్రోనింగ్ ఎవరు చేయొద్దు:

 •  ఒకవేళ ఏమైనా గాయలయ్యుంటే, ముఖ్యంగా ఎముకలకు దెబ్బలు తగిలి ఉంటే ప్రోనింగ్‌‌కు దూరంగా ఉండటం బెటర్.
 •  గర్భిణిలు ప్రోనింగ్ చేయకూడదు.
 •  తీవ్రమైన గుండె నొప్పితో బాధపడుతున్న వారు దీనికి దూరంగా ఉండాలి.
 •  వెన్నెముక, తొడ భాగాల్లో నొప్పి లేదా గాయాలతో బాధపడుతున్న వారు చేయకూడదు.

Tagged Corona patients, breathing, oxygen levels, lying, Proning, Self Proning

Latest Videos

Subscribe Now

More News