నయనతారకు హైదరాబాద్ లో ఎన్ని ఆస్తులు ఉన్నాయో తెలుసా..!

నయనతారకు హైదరాబాద్ లో ఎన్ని ఆస్తులు ఉన్నాయో తెలుసా..!

ప్రస్తుతం ఇండియన్ సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ అంటే టక్కున గుర్తొచ్చేపేరు నయనతార(Nayanatara). నార్త్, సౌత్ అనే తేడా లేకుండా వరుస భారీ ప్రాజెక్ట్స్ చేస్తూ.. హిట్స్ మీద హిట్స్ అందుకుంటోంది ఈ బ్యూటీ. ఇటీవల షారుఖ్(Shah rukh khan) హీరోగా వచ్చిన జవాన్(Jawan) సినిమాతో మరో భారీ విజయాన్ని అందుకుంది నయన్.

అంతేకాదు ఒక్కో సినిమాకు రెమ్యునరేషన్ కూడా భారీగానే అందుకుంటోంది నయనతార. రీసెంట్ గా వచ్చిన జవాన్ సినిమాకు ఏకంగా రూ.12 కోట్లు రెమ్యునరేషన్ అందుకుందనే వార్తలు వినిపించాయి. ఒక్కో సినిమాకు ఈ రేంజ్ లో వసూలు చేస్తున్న నయనతార.. ఆస్తులు కూడా బాగానే కూడబెట్టిందట.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kollywood (@nayan_memess)

తన సొంత ఊరిలోనే కాదు హైదరాబాద్ లో కూడా కోట్ల విలువ చేసే ఆస్తులున్నాయట నయనతారకు. హైదరాబాద్ లో ఈ అమ్మడుకు రెండు లగ్జురియాస్ అపార్ట్మెంట్స్ ఉన్నాయట. వాటి ఖరీదు ఒక్కోటి రూ.15 కోట్ల వరకు ఉంటుందని అంచనా. వాటిని తన అభిరుచికి తగ్గట్టుగా అందంగా, ఆకర్షణీయంగా ఉండేలా డిజైన్ చేయించుకుందట. ఇక ఇంటి కోసం ఉపయోగించిన ఫర్నీచర్, డిజైనర్ మెటీరియల్, లైటింగ్ వంటి వాటి కోసం కోట్లు ఖర్చు చేసిందట. తన బిజీ షెడ్యూల్స్ లో రిలాక్స్ అవడం కోసం హైదరాబాద్ లో ఉన్న ఈ అపార్ట్మెంట్స్ వస్తుందట నయనతార.

ఇక నయనతార సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె తమిళ స్టార్ హీరో జయం రవితో తనీ ఒరువన్2 లో నటిస్తోంది. ఈ సినిమాతో పాటు.. టెస్ట్, లేడీ సూపర్ స్టార్2, ఇరైవన్ సినిమాల్లో నటిస్తోంది.