
తెలంగాణలో మరో కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలోని కాటారం, మహాదేవపూర్, మహా ముత్తారం, మల్హర్, పలిమల ఐదు మండలాలు కలుపుకొని కాటారంకు రెవెన్యూ డివిజన్ గా ఉత్తర్వులు జారీ చేశారు తెలంగాణ ప్రభుత్వ ప్రిన్సిపాల్ సెక్రెటరీ నవీన్ మిట్టల్. దీనిపై అభ్యంతరాలు, వినతుల స్వీకరణకు 15 రోజుల గడువు ఇచ్చింది.