పెద్ద బ్యాంకులు పెట్టుబడిపెట్టిన స్టాక్.. రెండు రోజుల నుంచి క్రాష్.. జాగ్రత్త

పెద్ద బ్యాంకులు పెట్టుబడిపెట్టిన స్టాక్.. రెండు రోజుల నుంచి క్రాష్.. జాగ్రత్త

దేశీయ స్టాక్ మార్కెట్లు ఒడిదొడుకుల్లో కొనసాగుతున్న వేళ కొన్ని స్టాక్స్ పై ఇన్వెస్టర్ల కొనసాగుతోంది. అయితే పెద్దపెద్ద బ్యాంకులు ఇన్వెస్ట్ చేసిన కంపెనీల షేర్లు సైతం పతనాన్ని చూడటంతో చాలా మంది ఆందోళన చెందుతున్నారు.

ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ప్రొటియన్ ఇ-గవర్నెన్స్ టెక్నాలజీస్ కంపెనీ షేర్ల గురించే. వాస్తవానికి ఈ స్టాక్ రెండు రోజులుగా దేశీయ స్టాక్ మార్కెట్లలో ఫోకస్ లో కొనసాగుతోంది. సోమవారం ఇంట్రాడేలో 20 శాతం పతనాన్ని చూసిన స్టాక్ నేడు 13 శాతం క్షీణతను నమోదు చేసింది. దీంతో షేర్ ధర శుక్రవారం ఒక్కోటి రూ.1430 స్థాయి నుంచి భారీగా తగ్గి నేడు ఉదయం 11.08 గంటల సమయంలో రూ.1073 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తోంది. ఈ కంపెనీలో పంజాబ్ నేషనల్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐతో పాటు ప్రముఖ ఇన్వెస్టర్లు రమేష్ దమానీ, అజయ్ అగర్వాల్ కూడా పెట్టుబడులను కలిగి ఉన్నారని వెల్లడైంది.

అయితే కంపెనీ షేర్ల పతనానికి ఒక కీలక కారణం ఉంది. కేంద్ర ప్రభుత్వ చొరవతో ఆదాయపు పన్ను శాఖ తీసుకొస్తున్న పాన్ 2.0 ప్రాజెక్టు బిడ్డింగ్ ప్రక్రియలో కంపెనీ ఎంపిక కాలేదని స్టాక్ ఎక్స్ఛేంజీలకు సమాచారం అందించటమే దీనికి కారణంగా తెలుస్తోంది. అయితే ఇది కంపెనీపై చాలా తక్కువ ప్రభావాన్ని చూపుతుందని కంపెనీ పేర్కొన్నప్పటికీ ఇన్వెస్టర్లలో మాత్రం కంపెనీ ఆదాయాలపై ఆందోళన కొనసాగుతూనే ఉంది. 

అసలు ఏంటి ఈ పాన్ 2.0 ప్రాజెక్ట్..?
వాస్తవానికి దేశంలో ప్రస్తుతం ఉన్న పాన్ కార్డు విధానాన్ని ఆధునీకరించటానికి ఆదాయపు పన్ను శాఖ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చొరవే పాన్ 2.0 ప్రాజెక్ట్. దీంతో వాటి సేవలు మరింత సురక్షితంగా మారతాయని ప్రభుత్వం పేర్కొంది. ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమీటీ గత ఏడాది నవంబర్ 25న ప్రాజెక్టును ఆమోదించగా దీనికోసం దాదాపు రూ.వెయ్యి 435 కోట్లను కేంద్ర ప్రభుత్వం వెచ్చించాలని నిర్ణయించింది. పైగా కొత్తగా తీసుకొస్తున్న పాన్ కార్డుల్లో క్యూఆర్ కోడ్ టెక్నాజీని జోడించం భద్రతను మెరుగుపరుస్తుందని తెలుస్తోంది.