చెట్లు నరికితే కఠిన చర్యలు  

 చెట్లు నరికితే కఠిన చర్యలు  
  • అడవుల రక్షణ అందరి బాధ్యత
  •  చెట్లు నరికితే కఠిన చర్యలు    
  • త్వరలో అటవీ భూముల్లో ఆర్వోఎఫ్ఆర్ పట్టాల పంపిణీ
  • మంత్రి వేముల ప్రశాంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి

నిజామాబాద్/కామారెడ్డి, వెలుగు: పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు భవిష్యత్తులో అడవుల నరికివేత జరుగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి ఆదేశించారు. అడవుల పరిరక్షణ ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించాలని అన్నారు. పోడు భూముల సమస్యలపై బుధవారం  నిజామాబాద్, కామారెడ్డి జిల్లా ఉన్నతాధికారులతో మంత్రి వేర్వేరుగా రివ్యూ నిర్వహించారు. సమీక్షలో పోడు భూముల సమస్యల పరిష్కారానికి నిబంధనలను అనుసరిస్తూ చేపట్టాల్సిన చర్యలు, అటవీ విస్తీర్ణం పెంపొందించాల్సిన ఆవశ్యకతపై మంత్రి పలు సూచనలు చేశారు. ప్రస్తుతం ఉన్న చట్టాలకు లోబడి అటవీ భూముల్లో సాగు చేసుకుంటున్న వారికి ఆఖరి అవకాశంగా  ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు ఇవ్వాలన్నారు. ఈ ప్రక్రియ జరుగుతున్న సమయంలో  అటవీ ప్రాంతంలోని ఏ ఒక్క చెట్టు కూడా నరికి వేయకుండా బీట్ స్థాయిలో పర్యవేక్షణ జరపాలన్నారు. అవసరమైతే పోలీసు శాఖ సాయం తీసుకోవాలన్నారు. అటవీ ప్రాంతంలో  చెట్టు నరికివేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి స్పష్టం చేశారు. భవిష్యత్తులో తమతమ గ్రామాల్లోని అడవిని, అటవీ భూముల్ని కాపాడేందుకు రాజకీయ పార్టీలు, ప్రజలు చిత్తశుద్ధితో కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆయా ఫారెస్ట్ రేంజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల వారీగా అటవీ విస్తీర్ణం, ఫారెస్ట్ బీటలు, సిబ్బంది సంఖ్య తదితర వివరాలను మంత్రి ఆరా తీస్తూ, అటవీ ప్రాంతం ఎక్కువగా ఉన్న చోట అదనపు సిబ్బందిని సర్దుబాటు చేయాలని నిజామాబాద్ జిల్లా అటవీ శాఖ అధికారి వికాస్ మీనా, కామారెడ్డి అటవీ శాఖ అధికారి నిఖితకు సూచించారు.

హరితహారంతో మంచి ఫలితాలు..

హరితహారం కార్యక్రమానికి ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యం ఇస్తుందని మంత్రి ప్రశాంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యల ఫలితంగా తెలంగాణలో 2021 లెక్కల ప్రకారం రాష్ట్రంలో 6 శాతం అటవీ విస్తీర్ణం వృద్ధి చెందిందన్నారు. మరో మూడు శాతం కలిపి మొత్తంగా తొమ్మిది శాతం వరకు అటవీ విస్తీర్ణాన్ని పెంచుకోగలిగితే వర్షాభావ పరిస్థితులను అధిగమించవచ్చన్నారు. కాగా, పోడు భూముల సమస్యల పరిష్కారానికి చేపట్టే చర్యలు, గ్రామ, డివిజనల్, జిల్లా స్థాయిల్లో కమిటీల ఏర్పాటుకు చేస్తున్న కసరత్తులను కలెక్టర్లు మంత్రికి వివరించారు. సమావేశంలో విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్సీ వి.గంగాధర్ గౌడ్, జుక్కల్ ఎమ్మెల్యే షిండే, కలెక్టర్లు నారాయణ రెడ్డి, జితేష్ వి పాటిల్, సీపీ కె.ఆర్ నాగరాజు,ఎస్పీ శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, ఉర్దూ అకాడమీ కార్పొరేషన్ చైర్మన్ ముజీబుద్దీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అడిషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలెక్టర్లు చిత్రామిశ్రా, చంద్రశేఖర్, చంద్రమోహన్, డీటీడీపీవో జయసుధ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్యామ్ సుందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, అటవీ శాఖ డీఎఫ్ఓలు, రేంజ్ అధికారులు, డీఎల్పీవోలు పాల్గొన్నారు.