అసదుద్దీన్ ఇంటిపై దాడి.. గోడకు ‘భారత్ మాతాకీ జై’ అంటూ స్టిక్కర్లు

అసదుద్దీన్ ఇంటిపై దాడి.. గోడకు ‘భారత్ మాతాకీ జై’ అంటూ స్టిక్కర్లు
  • నేమ్ ప్లేట్ పై నల్లరంగు పూసిన అగంతకులు
  •  గోడకు ‘భారత్ మాతాకీ జై’ అంటూ స్టిక్కర్లు
  •  ఢిల్లీలోని నివాసం వద్ద ఘటన

ఢిల్లీ: ఎంఐఎం చీఫ్,ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఢిల్లీ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడ ఇచేశ ఆరు. ఇంటి నేమ్‌ ప్లేట్‌, గేటుపై నల్ల ఇంకును పూసి పేరు కనిపించకుండా చేశారు.  ఈ సంఘటన నిన్న రాత్రి జరిగినట్లు తెలుస్తోంది. ఆ క్రమంలో కొన్ని పోస్టర్లను కూడా అతికించారు. అందులో 'భారత్ మాతా కీ జై' అని రాసి ఉంది. ఈ విషయంపై అసదుద్దీన్ ఓవైసీ స్వయంగా తన ట్విటర్ ఖాతాలో వీడియోలో తెలిపారు. ఇలాంటి పిరికిపందల చర్యకు తాను భయపడనని ఓవైసీ అన్నారు.

తన ఢిల్లీ నివాసంపై లెక్కలేనన్ని సార్లు దాడి జరిగిందని అన్నారు. ఇది ఎలా జరుగుతుందని ఢిల్లీ పోలీసు అధికారులను అడిగితే వారు నిస్సహాయత వ్యక్తం చేశారని ఆరోపించారు. ఇది అమిత్ షా పర్యవేక్షణలో జరుగుతోందని భావిస్తున్నట్టు చెప్పారు. స్పీకర్ ఓం బిర్లా ఎంపీల భద్రతకు ఏం హామీ ఇస్తారో చెప్పాలని అన్నారు. ఇలాంటి ఘటనలతో తనను భయపెట్టలేరని అన్నారు. బుధవారం ఎంపీల ప్రమాణ స్వీకారం సందర్భంగా ఆయన జై పాలస్తీనా అంటూ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్టు తెలుస్తోంది.