ధర్నాలతో దద్దరిల్లిన ఆదిలాబాద్ కలెక్టరేట్

ధర్నాలతో దద్దరిల్లిన ఆదిలాబాద్ కలెక్టరేట్

ఆదిలాబాద్​ టౌన్, వెలుగు: ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్​ చేస్తూ  ప్రజలు, కార్మికులు, ఉద్యోగులు, పలు సంఘాల ఆధ్వర్యంలో ఆదిలాబాద్​కలెక్టరేట్​ ముందు సోమవారం ధర్నాలు చేశారు. 1960 నుంచి స్థానికంగా నివసిస్తున్న తమకు ఎస్టీ ధ్రువీకరణ పత్రాలు అందజేయాలని లంబాడీలు, పెండింగ్​లో ఉన్న మధ్యాహ్న భోజన కార్మికుల బిల్లులు చెల్లించాలని కార్మికులు ధర్నా చేపట్టారు.

జీవో నంబర్​49ను రద్దు చేయాలని ఆదివాసీ గిరిజన నాయకులు, తమ సమస్యలు పరిష్కరించాలని పంచాయతీ కార్మికులు వేర్వేరుగా పలు సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు తెలిపారు. ఈ ధర్నాలతో కలెక్టరేట్​ప్రాంగణం దద్దరిల్లింది. లంబాడీ పోరాట సమితి నాయకులు, సీఐటీయూ నేతలు, ఆదివాసీ గిరిజన సంఘం లీడర్లు తదితరులు పాల్గొన్నారు.