కరీంనగర్ కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌ ఎదుట దళిత జేఏసీ ఆధ్వర్యంలో నిరసన

కరీంనగర్ కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌ ఎదుట దళిత జేఏసీ ఆధ్వర్యంలో నిరసన

 కరీంనగర్ టౌన్, వెలుగు: సుప్రీంకోర్టు సీజే బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గవాయిపై దాడికి నిరసనగా దళిత జేఏసీ ఆధ్వర్యంలో లీడర్లు కరీంనగర్ కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌ ఎదుట బుధవారం నిరసనకు దిగారు. ఈ సందర్భంగా ప్రజామిత్ర ప్రొగ్రెసివ్‌‌‌‌‌‌‌‌ డెమెక్రటిక్‌‌‌‌‌‌‌‌ ఫ్రంట్‌‌‌‌‌‌‌‌ అధ్యక్షుడు కొరివి వేణుగోపాల్ మాట్లాడుతూ సీజేఐపై దాడి చేసిన వ్యక్తిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. ఖజురహో దేవాలయాల కేసు విచారణ సమయంలో సీజేఐ వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారని ఆరోపించారు. 

ఈ కేసుకు సంబంధించి అడ్వకేట్‌‌‌‌‌‌‌‌ రాకేశ్‌‌‌‌‌‌‌‌ కిశోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీజేఐపైకి బూటు విసిరిన  విషయం తెలిసిందే.  ఇది ఆయనపై జరిగిన దాడి కాదని, రాజ్యాంగంపై జరిగిన దాడిగా వేణుగోపాల్‌‌‌‌‌‌‌‌ అభివర్ణించారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు నల్లాల కనకరాజు, చంద్రయ్య, విజయ్ కుమార్, రాజేందర్, రాజయ్య, లచ్చన్న, రాజేశ్వర్, విశ్వం, సొల్లు బాబు, తదితరులు పాల్గొన్నారు.