కాగజ్‌నగర్, వెలుగు: ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలం ఈస్గాంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న వైన్స్‌ను ఊరికి దూరంగా తరలించాలని డిమాండ్ చేస్తూ ఐద్వా ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. గ్రామంలో వైన్స్ ఏర్పాటు చేయడం వల్ల మహిళలు, స్టూడెంట్స్ తీవ్ర ఇబ్బంది పడుతున్నారన్నారు.
ఈస్గాం నజ్రుల్‌నగర్ గ్రామ పంచాయతీ సమీపంలో కేటాయించిన వైన్ షాప్ కారణంగా ఇబ్బందులు కలుగుతాయని, దీనిని తరలించాలని ఎక్సైజ్ ఆఫీసర్లకు వినతిపత్రం ఇచ్చినా ఫలితం లేకుండా పోయిందన్నారు. ధర్నా విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వచ్చి ఐద్వా నాయకులకు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. ధర్నాలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు మాచర్ల వినోద, డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి గొడిసెల కార్తీక్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ ముంజం ఆనంద్‌కుమార్, ఐద్వా మండల అధ్యక్షురాలు మమతరాణా, మండల ఉపాధ్యక్షురాలు కాజల్ బిస్వాస్ పాల్గొన్నారు.
