నీటి సమస్య తీర్చాలని ఖాళీ బిందెలతో నిరసన

నీటి సమస్య తీర్చాలని ఖాళీ బిందెలతో నిరసన

జన్నారం, వెలుగు: తాగు నీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జన్నారం మండలం తిమ్మాపూర్ గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన మహిళలు రోడ్డెక్కారు. ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. తమ కాలనీలో బావులు ఎండిపోవడంతో నీటి ఎద్దడి ఏర్పడిందని.. సమస్య తీర్చాలని పంచాయతీ సెక్రటరీ, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం  చేశారు. ఇప్పటికైనా తమ కాలనీకి ట్యాంకర్ ద్వారా తాగునీరు సరఫరా చేయాలని డిమాండ్ ​చేశారు.