
పొరుగు దేశం నేపాల్ లో జనరేషన్-Z యువత నిర్వహిస్తున్న ఆందోళనలు పీక్స్ చేరాయి. ఆర్మీ కంట్రోల్ లోకి తీసుకున్న తర్వాత పరిస్థితులు కాస్త చక్కబడినట్లే కనిపించినా.. అక్కడక్కడ నిరసనకారులు పేట్రేగిపోతున్నారు. నిరసనల్లో భాగంగా ఒక హోటల్ కు నిప్పు పెట్టడంతో.. భారత్ కు చెందిన మహిళ చనిపోవడం దిగ్ర్భాంతికి గురిచేస్తోంది.
ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ కు చెందిన రాజేశ్ గోలా అనే 57 ఏళ్ల మహిళ చనిపోయింది. టూర్ కు వెళ్లిన కుటుంబం హయత్ రెజెన్సీలో ఉండగా ఆందోళన కారులు నిప్పు పెట్టారు. హోటల్ మంటల్లో చిక్కుకోవడంతో దూకి పారిపోయే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.
మంటలు పూర్తిగా వ్యాపించడంతో భయంతో ఒక్కసారిగా బిల్డింగ్ మీది నించి జంప్ చేసింది. దీంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమె భర్త రాంవీర్ సింగ్ గోలా ఆమెను ఖాట్మండులోని త్రిభువన్ యూనివర్సిటీ ఆస్పత్రికి తరలించాడు. అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు.
నేపాల్ లో నిరసనలు కొనసాగుతున్న వేళ.. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుశీల ఖర్కి మధ్యంతర ప్రభుత్వ ప్రధానిగా శుక్రవారం (సెప్టెంబర్ 12) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే అనూహ్యంగా నేపాల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ చీఫ్ కుల్మన్ ఘీసింగ్ పేరు కూడా లైన్ లోకి వచ్చింది. కానీ సుశీల నే బాధ్యతుల చేపట్టనున్నట్లు తెలుస్తోంది. మెజారీ జడ్--జెన్ ప్రతినిధులు సుశీల ఖర్కి నియామకానికి మద్ధతు ఇస్తున్నారు.