
ఆదిలాబాద్ జిల్లాలో ఎమ్మెల్యే జోగు రామన్న ఇంటి దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యే నిర్లక్ష్యం కారణంగానే రోడ్డు ప్రమాదంలో ఉస్మాన్ అనే వ్యక్తి చనిపోయాడంటూ బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఆదిలాబాద్ పట్టణ సమీపంలోని తాంసి రైల్వే గేటు దగ్గర.. ఉస్మాన్ అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తిచేయటంలో ఎమ్మెల్యే జోగు రామన్న నిర్లక్ష్యం చేయటంవల్లే.. ఉస్మాన్ చనిపోయాడంటూ కుటుంబ సభ్యులు ధర్నా చేపట్టారు. జోగు రామన్న ఇంటి ముందు ధర్నా చేపట్టంతో ఎమ్మెల్యేకు.. బాధిత కుటుంబానికి మధ్య వాగ్వాదం జరిగింది. అంత్యక్రియలు పూర్తయిన తర్వాత మాట్లాడుదామని జోగు రామన్న చెప్పటంతో గొడవ సద్దుమణిగింది.
For More News..