ప్రోటోకాల్ రగడ.. పురుగు మందు డబ్బాతో రైతు నిరసన

V6 Velugu Posted on Apr 10, 2021

ములుగు జిల్లాలో TRS, కాంగ్రెస్ మధ్య ప్రోటోకాల్ గొడవ ఘర్షణకు దారి తీసింది. రామప్ప చెరువు నుంచి ఫీడర్ కెనాల్ ద్వారా గణపసముద్రంలోకి నీటిని విడుదల చేయడానికి వచ్చారు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి. కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే సీతక్కను పిలవకపోవడంపై కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. దళిత ఎమ్మెల్యేను అవమానించారంటూ... ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. కెనాల్ కింది భూనిర్వాసితులకు పరిహారం ఇవ్వకుండా నీటిని విడుదల చేయొద్దంటూ... పురుగు మందుల డబ్బాలతో ఆందోళనకు దిగడం ఉద్రిక్తతకు దారితీసింది. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీ నాయకులకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులు నివారించినప్పటికీ ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఉద్రిక్తతల మధ్యే ట్రయల్ రన్ ను ప్రారంభించారు ఎమ్మెల్యే గండ్ర వెంకటారమాణారెడ్డి.

Tagged TRS, Congress, Seethakka, mulugu

Latest Videos

Subscribe Now

More News