ఎంబీబీఎస్ చదువు కోసం .. పేద స్టూడెంట్ కు చేయూత

ఎంబీబీఎస్ చదువు కోసం .. పేద స్టూడెంట్ కు చేయూత

సుల్తానాబాద్, వెలుగు:  పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్ పూర్ గ్రామంలోని నిరుపేద కుటుంబానికి చెందిన కీర్తి శరణ్య అనే స్టూడెంట్ ఎంబీబీఎస్​ చదువు కోసం పలువురు ముందుకొచ్చి ఆర్థిక సాయం అందిస్తున్నారు. నీట్ లో 979 ర్యాంకు సాధించి ఎంబీబీఎస్ చదవాలన్న శరణ్య లక్ష్యానికి ఆర్థిక పరిస్థితులు అడ్డంకిగా మారడంపై ఇటీవల  వెలుగు పేపర్​లో ‘పని చేసుకుంటేనే బతికేది.. ఎంబీబీఎస్ ఎలా చదివేది? ’ అనే శీర్షికన కథనం ప్రచురితమైంది.

దీనికి స్పందించిన ‘నా నేస్తం’ చారిటబుల్ ట్రస్ట్ వారు ఆదివారం శరణ్యకు రూ.25 వేల ఆర్థిక సాయం అందించారు.  కార్యక్రమంలో ట్రస్ట్ మాజీ అధ్యక్షుడు కట్ల సత్యనారాయణ, తానిపర్తి సుధాకర్ రావు, కట్ల సంపత్, రంగు రాములు గౌడ్, వీరస్వామి గౌడ్, ప్రకాశ్​, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. అంతకుముందు భరోసా స్వచ్ఛంద సంస్థ వారు రూ.35 వేల ఆర్థిక సాయాన్ని జిల్లా అడిషనల్ కలెక్టర్ జీవి శ్యాం ప్రసాద్ చేతుల మీదుగా అందించారు. సంస్థ ప్రతినిధులు అక్కినపల్లి నాగరాజు, తాటిపెళ్లి సతీశ్​ బాబు, ఆర్. లింగారావు, పాత శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా శరణ్య వెలుగు పేపర్​కు, దాతలకు కృతజ్ఞతలు తెలిపింది.