రూ. 55 లక్షలతో ఆలయ పునర్నిర్మాణ పనులు: గుత్తా సుఖేందర్ రెడ్డి 

రూ. 55 లక్షలతో ఆలయ పునర్నిర్మాణ పనులు:  గుత్తా సుఖేందర్ రెడ్డి 

మిర్యాలగూడ, వెలుగు : మండలంలోని కల్లేపల్లిలో కొలువైన బంగారు మైసమ్మ ఆలయంలో ప్రభుత్వం రూ. 55 లక్షలతో పునర్నిర్మాణ పనులు చేపడుతోందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. గురువారం శ్రీ కల్లేపల్లి బంగారు మైసమ్మ ఆలయ పునర్నిర్మాణ పనులకు ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు, ట్రైకార్, ఆగ్రోస్ చైర్మన్లు ఇస్లావత్ రాంచందర్ నాయక్, తిప్పన విజయసింహారెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు.

గిరిజనుల ఆరాధ్యదైవంగా ప్రత్యేక పూజలందుకుంటున్న బంగారు మైసమ్మ ఆలయ ప్రాంగణంలో అన్ని వసతులను కల్పించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు ధీరావత్ స్కైలాబ్ నాయక్, డీసీఎంఎస్ వైస్ ఛైర్మన్ దుర్గంపూడి నారాయణరెడ్డి, ఏంఎంసీ చైర్మన్ బైరం సంపత్, ఎంపీపీ నందిని రవితేజ, జడ్పీటీసీ ఆంగోతు లలితహతీరాం నాయక్, ఏఎంసీ వైస్ చైర్మన్​ వీరకోటిరెడ్డి పాల్గొన్నారు.