- పీఆర్, ఆర్డీ డైరెక్టర్‌కు పీఎస్సీఎఫ్ వినతి
హైదరాబాద్, వెలుగు: జీవో నంబర్317 తో స్థానికత కోల్పోయిన అందరిని 190 జీవో ద్వారా వేకెన్సీతో సంబంధం లేకుండా జోన్లతోపాటు అంతర్గత జోన్లలో కూడా సొంత జిల్లాలకు ట్రాన్స్ఫర్ చేయాలని పంచాయతీ సెక్రటరీస్ సెంట్రల్ ఫోరమ్ (పీఎస్ సీఎఫ్) స్టేట్ ప్రెసిడెంట్ బలరాం పేర్కొన్నారు.
గ్రామ పంచాయతీల గ్రేడింగ్, క్యాడర్ స్ట్రెంత్ వెంటనే నిర్ధారించాలని తెలిపారు. ఈ మేరకు సోమవారం సెక్రటరీస్ సెంట్రల్ ఫోరమ్ నేతలు ఖైరతాబాద్ ఆనంద్ నగర్‌కాలనీలోని పంచాయతీరాజ్ కమిషనరేట్‌లో పీఆర్, ఆర్డీ డైరెక్టర్ సృజనను కలిసి తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. కార్యదర్శుల సమస్యలపై డైరెక్టర్సానుకూలంగా స్పందించినందుకు ధన్యవాదాలు చెప్పారు.
