సందడిగా కేబీఆర్ ప్రొమెనేడ్

 సందడిగా కేబీఆర్ ప్రొమెనేడ్

కేబీఆర్ పార్కులో ‘ప్రజా సంబరాలు (కేబీఆర్ ప్రొమెనేడ్ )’ ఆదివారం సందడిగా జరిగాయి. పార్కు ఎంట్రెన్స్ ల వద్ద పెయింటింగ్, చిత్రలేఖనం, లైవ్ మ్యూజిక్, సెల్ఫీ ఫొటో,  పిల్లలకు పెద్దలకు స్పోర్ట్స్, క్రాఫ్ట్స్ తదితర  పోటీలు నిర్వహించారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర  సంస్కృతి సంప్రదాయాలు భావి తరాలకు అందించాలనే సంకల్పంతో జీహెచ్ఎంసీ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. మధ్యాహ్నం12.30 గంటల నుంచి సాయత్రం 6.30 గంటల వరకు సాగిన కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.   – వెలుగు, హైదరాబాద్​ సిటీ