పీహెచ్సీల నుంచి మెడికల్ కాలేజీలకు డాక్టర్లు

పీహెచ్సీల నుంచి మెడికల్ కాలేజీలకు డాక్టర్లు
  • పీజీ పూర్తి చేసిన వారికి అవకాశం ఇచ్చిన పబ్లిక్ హెల్త్ డైరెక్టర్

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో పనిచేయాలని ఆసక్తి కలిగిన సివిల్ అసిస్టెంట్ సర్జన్లకు పబ్లిక్ హెల్త్ డిపార్ట్ మెంట్ మంచి అవకాశాన్ని కల్పించింది. ప్రైమరీ హెల్త్ సెంటర్లు (పీహెచ్‌‌సీలు), ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలందిస్తున్న పోస్ట్ గ్రాడ్యుయేట్ (పీజీ) పూర్తి చేసిన డాక్టర్లకు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) విభాగంలో చేరే అవకాశం కల్పించింది. 

ఈ మేరకు సోమవారం పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ జి. రవీందర్ నాయక్  ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. పీజీ పూర్తి చేసిన డాక్టర్లు తమ సర్వీసు వివరాలు, స్టడీ సర్టిఫికెట్లు, ఎక్స్ పీరియన్స్, ఇతర సర్టిఫికెట్లను పబ్లిక్ హెల్త్ డిపార్ట్ మెంట్ ఈమెయిల్ కు పంపాలని సూచించారు.