జై శ్రీరాం: సోమవారం పబ్లిక్ హాలిడే ప్రకటించిన ప్రభుత్వం

జై శ్రీరాం: సోమవారం పబ్లిక్ హాలిడే ప్రకటించిన ప్రభుత్వం

అయోధ్య రామమందిరంలో ప్రాణప్రతిష్ట కోసం దేశం మొత్తం ఎదురుచూస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు ఆ రోజు సెలవు ప్రకటించాయి. ఈ లిస్టులో ఇపుడు మహారాష్ట్ర చేరింది.  అయోధ్యలోని రామమందిర ప్రాణప్రతిష్ఠ వేడుక సందర్భంగా జనవరి 22న మహారాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

జనవరి 22న మహారాష్ట్రలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు మూసివేయడతాయి. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు, పారిశ్రామిక సంస్థలు మధ్యాహ్నం 2.30 గంటల వరకు మూసివేస్తారు. రాష్ట్రంలోని  ప్రభుత్వ రంగం బ్యాంకులు, బీమా కంపెనీలు మధ్యాహ్నం 2.30 గంటల వరకు సగం రోజు మూసివేయబడతాయి. 

మరోవైపు ఇప్పటికే హర్యానా, మధ్యప్రదేశ్ ,మిజోరాం, ఒడిశా, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల ప్రభుత్వాలు జనవరి 22న శ్రీరామ ప్రాణ ప్రతిష్టా మహోత్సవం సందర్భంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు