ఎంట్రీ లెవెల్ కార్లకు జోష్

ఎంట్రీ లెవెల్ కార్లకు జోష్

ప్యాసింజర్‌‌ వెహికల్స్‌‌ సేల్స్ ఆగస్టులో తగ్గినయ్​

ముందు నెలలతో పోలిస్తే కాస్త బెటర్

న్యూఢిల్లీ: ప్యాసెంజర్ వెహకిల్(పీవీ) రిటైల్ సేల్స్ ఆగస్ట్ నెలలో 7.12 శాతం పడిపోయి 1,78,513 యూనిట్లుగా రికార్డయ్యాయి. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్(ఫాడా) డేటాలో ఈ విషయం వెల్లడైంది.  1,450 రీజనల్ ట్రాన్స్‌‌పోర్ట్ ఆఫీసుల్లో(ఆర్‌‌‌‌టీఓల్లో) 1,242 ఆఫీసుల నుంచి సేకరించిన వెహకిల్ రిజిస్ట్రేషన్ డేటా ప్రకారం ఫాడా పీవీ రిటైల్ సేల్స్ డేటాను విడుదల చేసింది. 2019 ఆగస్ట్ నెలలో పీవీ సేల్స్ 1,92,189 యూనిట్లుగా ఉన్నట్టు ఫాడా పేర్కొంది.  గత నెలలో  టూవీలర్ సేల్స్ కూడా 28.71 శాతం తగ్గిపోయి 8,98,775 యూనిట్లుగా ఉన్నాయి. అంతకుముందు ఏడాది ఇదే నెలలో టూవీలర్ సేల్స్ 12,60,722 యూనిట్లుగా రికార్డయ్యాయి. కమర్షియల్ వెహకిల్ సేల్స్ 57.39 శాతం తగ్గి 26,536 యూనిట్లుగా ఉన్నట్టు ఫాడా డేటాలో తెలిసింది. త్రీ వీలర్ సేల్స్ 69.51 శాతం తగ్గి 16,857 యూనిట్లుగా ఉన్నట్టు వెల్లడైంది. గత ఏడాది ఇదే నెలలో ఈ సేల్స్ 55,293 యూనిట్లుగా ఉన్నాయి. అన్ని కేటగిరీల్లో మొత్తం సేల్స్ ఆగస్ట్ నెలలో 26.81 శాతం తగ్గి 11,88,087 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే నెలలో ఈ సేల్స్ 16,23,218 యూనిట్లుగా ఉన్నాయి. ఫెస్టివ్ సీజన్ మొదలుకావడం, కరోనా లాక్‌‌డౌన్ నుంచి పూర్తిగా ఆంక్షలు ఎత్తివేయడంతో అంతకుముందు నెలలతో పోలిస్తే గత నెలలో కాస్త మంచిగానే అమ్మకాలు ఉన్నట్టు ఫాడా ప్రెసిడెంట్ వింకేశ్ గులాటి అన్నారు. అన్ని కేటగిరీల సేల్స్‌‌లో కాస్త రికవరీ ఉన్నట్టు చెప్పారు. పర్సనల్ మొబిలిటీలో ఎంట్రీ లెవెల్​ ప్యాసెంజర్ వెహికల్స్​‌‌కు ఎక్కువగా డిమాండ్ వచ్చిందని,  కరోనాతో చాలా మంది పర్సనల్ మొబిలిటీను ప్రిఫర్ చేస్తున్నారని గులాటి పేర్కొన్నారు. అర్బన్ ప్రాంతాల నుంచి కూడా రికవరీ సంకేతాలు ఉన్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే మొత్తంగా డిమాండ్ మాత్రం ఇంకా కరోనా ముందు స్థాయిలకు రాలేదన్నారు. బ్యాంక్‌‌లు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు ఇంకా కమర్షియల్ వెహికల్స్​‌‌కు ఫండింగ్ ఇచ్చే విషయంలో జాగ్రత్తలు వహిస్తున్నారని తెలిపారు. డిమాండ్ పెంచడం కోసం స్టిమ్యులస్‌‌ను, టూవీలర్లపై జీఎస్టీ రేటు తగ్గింపును ఫాడా కోరుతోంది. ఇన్సెంటివ్ బేస్డ్ స్క్రాపేజీ పాలసీ కోసం వేచిచూస్తున్నట్టు కూడా గులాటి చెప్పారు. ప్రభుత్వం తీసుకునే ఈ రెండు చర్యలు టూవీలర్లకు, మీడియం, హెవీ కమర్షియల్ వెహకిల్ సేల్స్‌‌కు డిమాండ్ పెంచుతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.

For More News..

రోజుకు ఏపీ వాటా 2,250  క్యూసెక్కులే

వీడియో: రోహిత్ శర్మ సిక్స్ కొడితే.. స్టేడియం ముందు వెళ్తున్న బస్‌పై పడింది