
హైదరాబాద్ లోని జ్యోతిరావు పూలే ప్రజాభవన్ లో ప్రజావాణికి జనం చేరుకుంటున్నారు. డిసెంబర్ 19 ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంటల వరకు ప్రజావాణి కార్యక్రమం జరగనుంది. ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. ప్రభుత్వానికి తమ సమస్యలను చెప్పుకునేందుకు ఉదయం నుంచే తరలివస్తున్నారు. కొత్త సర్కార్ పై నమ్మకంతో ఇక్కడిదాక వచ్చామని చెబుతున్నారు.
దాసరి హరిచందనను ప్రజావాణికి స్టేట్ నోడల్ ఆఫీసర్ గా కూడా నియమిస్తూ సీఎస్శాంతి కుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రతి మంగళ, శుక్రవారాల్లో ప్రజావాణి జరగనుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు ప్రజావాణి జరగనుంది. 10 గంటల వరకు లైన్లో ఉన్న వారికే లోపలికి అనుమతిస్తారు.