
- అవస్థలు పడుతున్న పట్టణ వాసులు
- మహిళలకు తప్పని ఇబ్బందులు
- సింగరేణి సులభ్ కాంప్లెక్స్‌లే దిక్కు
మందమర్రి,వెలుగు: జిల్లాలో సరిపడు పబ్లిక్ టాయిలెట్స్ లేకపోవడంతో జనాలు ఇబ్బంది పడుతున్నారు. మంచిర్యాల, మందమర్రి, బెల్లంపల్లి, క్యాతనపల్లి, నస్పూర్, చెన్నూరు, లక్సెట్టిపేట మున్సిపాలిటీల్లో చాలామంది టాయిలెట్స్కోసం చుట్టుపక్కల ఖాళీ ప్రదేశాలకు వెళ్తున్నారు.జనాభాకు అనుగుణంగా మున్సిపాలిటీల్లో కనీస మౌలిక వసతులు కల్పించడంలో ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లు విఫలమవుతున్నారు. మంచిర్యాల, మందమర్రి, బెల్లంపల్లి పాత మున్సిపాలిటీలు కాగా.. కొత్తగా రామకృష్ణాపూర్, చెన్నూరు, నస్పూర్, లక్సెట్టిపేట ఏర్పడ్డాయి. అయితే మున్సిపాలిటీలుగా ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు ఆయా పట్టణాల్లో ఒక్క పబ్లిక్ టాయిలెట్కూడా ఏర్పాటు చేయలేదు. స్వచ్ఛ భారత్ మార్గ దర్శకాల ప్రకారం మున్సిపాలిటీల్లో ప్రతి వేయి జనాభాకు ఒక మరుగుదొడ్డి(సీటు) చొప్పున అందుబాటులో ఉండాలి. లక్ష జనాభాకు 100 సీట్లు. అందులో పురుషులు, స్ర్తీలకు 50 చొప్పున ఉండాలి. కానీ... ఎక్కడ కూడా లేవు. గ్రామీణ ప్రాంతాల నుంచి వివిధ అవసరాల కోసం మంచిర్యాల, బెల్లంపల్లి,లక్సెట్టిపేట, చెన్నూరు, మందమర్రి తదితర పట్టణాలకు వస్తుంటారు. అయితే జనసంచారం ఎక్కువగా ఉన్నా టాయిలెట్స్ లేకపోవడంతో ఇబ్బందులు తప్పడంలేదు. కొన్ని ఏరియాల్లో బిల్డ్‌ఆపరేట్ ట్రాన్స్ఫర్ పద్ధతిన నిర్మించిన మరుగుదొడ్ల నిర్వహణను ఎవరూ పట్టించుకోవడంలేదు. పట్టణ ప్రగతి కింద పాత ఆర్టీసీ బస్సులను కొనుగోలు చేసి, వాటిలో మెన్, విమెన్ కు వేర్వేరుగా సౌలత్ కల్పలించాల్సి ఉంది. మంచిర్యాలలో బయో టాయిలెట్సిస్టం అందుబాటులో ఉన్నా.. నిర్వహణలేదు. ఏడు మున్సిపాలిటీల పరిధిలో గుర్తించిన వర్తక వాణిజ్య సముదాయాలు సుమారు 3,500 వరకు ఉంటాయి. ఇటీవల మందమర్రిలో జరిగిన వ్యాపార సంఘం ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఏకంగా పబ్లిక్ టాయిలెట్స్ నిర్మించేందుకు కృషి చేస్తామంటూ హామీ కూడా ఇచ్చారు.
సొమ్ము ఒకరిది.. సోకు మరొకరిది..
బొగ్గు గనులు విస్తరించిన పట్టణాల్లో సింగరేణి యాజమాన్యమే సుమారు 200 సామూహిక టాయిలెట్స్ నిర్మించింది. వీటిలో మందమర్రి, నస్పూర్, రామకృష్ణాపూర్, బెల్లంపల్లి మున్సిపాలిటీల పరిధిలో సుమారు 125 వరకు ఉంటాయి. మందమర్రి, రామకృష్ణాపూర్, నస్పూర్ సింగరేణి ప్రాంతాల్లో పబ్లిక్టాయిలెట్స్సంఖ్య ఎక్కువగా ఉన్నాయనే సాకుతో మున్సిపల్ శాఖ వారు కొత్తగా ఒక్కటి కూడా నిర్మించలేదు. అత్యవసర సమయంలో జనం బలవంతంగా ఆపుకోలేక అత్యవసర సమయంలో బస్టాండ్లు, షాపింగ్‌కాంప్లెక్స్ సందులు, లేదంటే రోడ్ల వెంట కానివ్వడమో చేస్తున్నారు.
ఇబ్బందులు పడుతున్నారు...
మందమర్రి మార్కెట్ ఏరియాలో 200కుపైగా దుకాణ సముదాయాలున్నాయి. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఒక పబ్లిక్ టాయిలెట్ కూడా నిర్మించలేదు. వ్యాపారులు, షాపింగ్‌కు వచ్చే ప్రజలు టాయిలెట్‌కు వెళ్దామంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. చిరువ్యాపారం చేసుకునే మహిళల పరిస్థితి మరీ దారుణం.
–మాయ రమేశ్, వ్యాపారి, మందమర్రి