ఆ కప్ గెలవాలంటే పుజారా మరిన్ని షాట్‌లు కొట్టాలె

V6 Velugu Posted on Jun 12, 2021

చెన్నై: నయా వాల్ ఛటేశ్వర్ పుజారాకు ఇంగ్లండ్ పిచ్‌‌లపై రాణించడం చాలా కష్టమని టీమిండియా మాజీ క్రికెటర్ డబ్ల్యూవీ రామన్ అన్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్‌లో భారత్ గెలవాలంటే పుజారా రాణించడం కీలకమన్నాడు. ‘ఇంగ్లీష్ కండీషన్స్‌లో రాణించాలంటే పుజారా మరింత ఫోకస్‌తో ఆడాలి. మరిన్ని షాట్‌లు కొట్టడం అలవర్చుకోవాలి. అక్కడి పరిస్థితుల్లో పరుగులు చేయడానికి చాలా తక్కువ అవకాశాలు లభిస్తాయి. వాటిని బాగా సద్వినియోగం చేసుకోవాలి. అందుకోసం పుజారా క్రీజులో నిలదొక్కుకోవాలి. కానీ స్వింగ్, సీమ్ ఎక్కువగా ఉండే ఇంగ్లీష్ పిచ్‌లపై ఇదేమంత సులువు కాదు. అయితే ఎక్కువగా షాట్లు కొడుతూ అవకాశం దొరికినప్పుడల్లా రన్స్ తీస్తూ పోతే ప్రత్యర్థిపై పైచేయి సాధించొచ్చు. బౌలర్లను కూడా ఒత్తిడిలోకి నెట్టొచ్చు’ అని రామన్ పేర్కొన్నాడు. 

Tagged Team india, England series, New Zealand, WTC final, WV Raman, Chateshwar Pujara

Latest Videos

Subscribe Now

More News