ఉద్యోగాలకు ప్రత్యేకం.. జర్నలిజం, రచన, నాటకం, సంగీత రంగాలకు పులిట్జర్​ ప్రైజ్

ఉద్యోగాలకు ప్రత్యేకం.. జర్నలిజం, రచన, నాటకం, సంగీత రంగాలకు పులిట్జర్​ ప్రైజ్

జర్నలిజం, రచన, నాటకం, సంగీత రంగాల్లో పులిట్జర్​ ప్రైజ్​ను అందజేస్తారు. 1917లో కొలంబియా యూనివర్సిటీ నిర్వాహకుడు, ప్రముఖ పాత్రికేయుడు జోసెఫ్​ పులిట్జర్​ పేరు మీద ఈ ప్రైజ్​ను అందిస్తున్నారు. ఈ పురస్కారాలను కొలంబియా విశ్వవిద్యాలయం ఏటా అందజేస్తోంది. విజేతలకు ధ్రువీకరణ పత్రంతోపాటు రూ.11.58లక్షల నగదును ప్రదానం చేస్తారు. 2023కుగాను వర్గ భేదాలు ఇతివృత్తంగా రచించిన రెండు నవలలకు కాల్పినక సాహిత్యంలో పులిట్జర్​ ప్రైజ్​ను ప్రకటించారు. చార్లెస్​ డికెన్స్​ రచించిన డేవిడ్​ కాపర్​ ఫీల్డ్​ నవలను ఆధునిక కాలానికి అన్వయిస్తూ బార్బరా కింగ్సాల్వర్​ రచించిన డీమన్​ కాపర్​ హెడ్​ నవలతోపాటు 1920ల నాటి న్యూయార్క్​ నగరంలో సంపద, మోసాలే ఇతివృత్తంగా హెర్నన్​ డియాజ్​ రచించిన ట్రస్ట్​ నవలకు పులిట్జర్​ బహుమతులు ప్రకటించారు.

  •     జీవిత కథా విభాగంలో ఎఫ్​పీఐ పూర్వ అధిపతి     జె.ఎడ్గార్​ హూవర్​ జీవిత కథ జి–మ్యాన్​కు పులిట్జర్​ బహుమతి లభించింది. దీన్ని బెవర్లీ గేజ్​ రచించారు.
  •     నాటక విభాగంలో ఇరానీ అమెరికన్​ సనాజ్​ టూస్సి రాసిన ఇంగ్లిష్​కు చరిత్ర విభాగంలో జెఫర్సన్​ కోవీ విరచిత ఫ్రీడమ్స్​ డొమినియన్​కూ పులిట్జర్​ బహుమతులు దక్కాయి.
  •     ఆత్మకథా విభాగంలో హువాను రచించిన స్టేట్రూకు, కవిత్వ విభాగంలో కార్ల్​ ఫిలిప్స్​ సంకలనానికి, సంగీత విభాగంలో రియానన్​ గిడెన్స్​, మైకేల్​ ఏబెల్స్​ల గీతం ఓమార్​కు పులిట్జర్​ బహుమతులు లభించాయి.