మల్టీవిటమిన్ వేసుకుంటే కరోనా రాదా.? నిజమెంత?

V6 Velugu Posted on May 17, 2021

ఇవి తింటే కొవిడ్​ రాదు.. అలా చేస్తే కొవిడ్​ ముప్పే ఉండదు. ఇలా రోజుకో  ఫార్వర్డ్​ మెసేజ్ సోషల్​ మీడియాలో​​ చక్కర్లు కొడుతుంటుంది. అలా ఈ మధ్య ‘‘మల్టీవిటమిన్​ టాబ్లెట్స్​ వేసుకుంటే కరోనా రమ్మన్నా రాదు’’ అనే  మెసేజ్​ హల్​చల్​ చేస్తోంది. ఇందులో నిజమెంత? అని ఫేమస్​ పల్మొనాలజిస్ట్​ డాక్టర్​ వికాస్​ మౌర్యని అడిగితే.. ‘‘చాలామంది కొవిడ్​ భయానికి డాక్టర్​ సలహా తీసుకోకుండా మల్టీవిటమిన్​ టాబ్లెట్లు వేసుకుంటున్నారు. కానీ, నిజానికి మల్టీవిటమిన్​ టాబ్లెట్స్​కి, కొవిడ్​కి సంబంధమే లేదు. రెగ్యులర్​గా​ మల్టీవిటమిన్స్​ వేసుకున్నా కొవిడ్​ వస్తుంది. అయితే  మల్టీవిటమిన్స్​ ఇమ్యూనిటీ బూస్టర్స్​గా పనిచేస్తాయి.  ఫిజికల్​గా ఫిట్​గా ఉంచుతాయి.​ అంతే తప్పించి కొవిడ్​కి మల్టీవిటమిన్స్​కి సంబంధమే లేదు. డాక్టర్ ప్రిస్ర్కిప్షన్​ లేకుండా వీటిని వేసుకోవద్దు” అని చెప్పారాయన.

Tagged covid, Pulmonologist Dr. Vikas, Multivitamin tablets

Latest Videos

Subscribe Now

More News