3 రోజుల్లో రెండో ఘటన.. కుప్ప కూలిన మరో ట్రైనింగ్ ఎయిర్ క్రాఫ్ట్

3 రోజుల్లో రెండో ఘటన.. కుప్ప కూలిన మరో ట్రైనింగ్ ఎయిర్ క్రాఫ్ట్

పూణె జిల్లాలోని గోజుబావి గ్రామ సమీపంలో అక్టోబర్ 22న ఉదయం శిక్షణా సమయంలో శిక్షణ విమానం కూలిపోయింది. కుప్పకూలిన ఈ శిక్షణ విమానం రెడ్‌బర్డ్ ఫ్లైట్ ట్రైనింగ్ ఎయిర్‌క్రాఫ్ట్ కు చెందినది. ఈ ప్రమాదంలో గాయాలు గానీ, ప్రాణనష్టానికి సంబంధించిన వివరాలను ఇప్పటివకరకు వెల్లడించలేదు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) కూడా ఈ విషయంపై ఒక ప్రకటన విడుదల చేసింది. "రెడ్ బర్డ్ అకాడమీ టెక్నామ్ ఎయిర్‌క్రాఫ్ట్ VT-RBT బారామతి ఎయిర్‌ఫీల్డ్ సమీపంలో అత్యవసర ల్యాండింగ్ చేసింది. శిక్షకుడు, ట్రైనీ ఇద్దరూ సురక్షితంగా ఉన్నారు. తదుపరి విచారణ కొనసాగుతోంది" అని రెగ్యులేటర్ ఏజెన్సీ తెలిపింది.

Also Read :- కాఠ్‌మాండూలో భూకంపం

అంతకుముందు అక్టోబర్ 19న సాయంత్రం మహారాష్ట్రలోని పూణే జిల్లాలోనూ ఇద్దరు వ్యక్తులతో ప్రయాణిస్తున్న శిక్షణా విమానం కూలిపోయింది. ఈ ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి. "రెడ్‌బర్డ్ ఇన్‌స్టిట్యూట్ (రెడ్‌బర్డ్ ఫ్లైట్ ట్రైనింగ్ అకాడమీ)కి చెందిన శిక్షణా విమానం సాయంత్రం 5 గంటలకు బారామతి తాలూకా పరిధిలోని కట్‌ఫాల్ గ్రామ సమీపంలో కూలిపోయింది. ఈ సమయంలో పైలట్ తో పాటు మరొక వ్యక్తి విమానంలో ఉన్నారు. ఘటన అనంతరం గాయాలైన వారిని ఆసుపత్రికి తరలించార"ని బారామతి పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ప్రభాకర్ మోరే తెలిపారు.