మ్యాన్ ఈజ్ మ్యాన్ : రోడ్లపై నీళ్లల్లో ఫ్లోటింగ్ బెడ్ తో ఇలా..

మ్యాన్ ఈజ్ మ్యాన్ : రోడ్లపై నీళ్లల్లో ఫ్లోటింగ్ బెడ్ తో ఇలా..

వర్షం భారీగా కురుస్తోంది. రోడ్డంతా బురద నీళ్లతో నిండిపోయి, నాలాలు నిండుగా పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో యువకుడు చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఒక యువకుడు వర్షం నీళ్లలో  రోడ్డుపై పరుపుతో సర్ఫింగ్ చేయడం ప్రారంభించాడు. బురద నీటిలో వాహనా దారులకు ఇబ్బందులు కలిగేలా పడుకుని సర్ఫింగ్ చేశాడు. రోడ్డుపైన ఉన్నవారంతా .. ఏంటి వీడికేమన్నా పిచ్చా.. అంటూ అతడిని తిట్టిపోశారు. mipunekar.in అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోను పుణె లోని ఎరవాడ ప్రాంతంలో రికార్డు చేసినట్లు తెలుస్తోంది. వైరల్ గా మారిన ఈ వీడియోలో రోడ్డుపై నీరు బీభత్సంగా ప్రవహిస్తోంది

వీడియోలో ఒక యువకుడు వీధిలో నీటిపై తేలియాడుతున్న మందపాటి తెల్లటి చాపపై పడుకుని ఉన్నాడు. రోడ్డుపై ప్రవహించే నీటితో చాప కూడా ప్రవహిస్తోంది. దానిపై ఆ యువకుడు మాత్రం హాయిగా సేదతీరుతున్నాడు.. ఈ సీన్ చూసి అందరూ షాక్ అవుతున్నారు. పైగా అతడు రోడ్డుపై వెళ్తున్న వాహనాలకు చేయి ఊపుతూ సైడ్ సైడ్ అనుకుంటూ నడిరోడ్డుపై బోటింగ్ చేస్తున్నాడు. చాలా మంది వానను ఆస్వాదించడాన్ని మీరు చూసి ఉండవచ్చు. కానీ, ఇలాంటి వింత ఎంజాయ్‌మెంట్‌ని మాత్రం ఇప్పుడే మొదటిసారిగా చూసి ఉంటారు..  అతడు బిజీ రోడ్డుపై అలా సర్ఫింగ్ చేస్తుంటే చుట్టుపక్కల వారు వీడియో తీసినట్లు తెలుస్తోంది. ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో ట్రెండింగ్ మారింది.

 ప్రజలు ఈ వీడియోను పెద్ద సంఖ్యలో లైక్ చేసారు. పలువురు దానిపై ఫన్నీ కామెంట్స్ చేశారు. అలాగే, నేరుగా ఎరవాడ జైలుకు వెళ్లు గురూ అంటూ కొందరు ఫన్నీగా కామెంట్‌ చేవారు. మరికొందరు మన మనసుల్ని గెలిచావ్‌ బాస్‌ అంటూ కామెంట్ చేశారు. హాలో బ్రో.. అలాగే వెళ్తే నెక్ట్స్‌ మురుగు కాల్వలోకే వెళ్లేది అంటూ కామెంట్స్‌లో రాసుకొచ్చారు. మరికొందరు మాత్రం ఇదేం పైత్యం అంటూ కామెంట్లు పెడుతున్నారు. 

సోషల్ మీడియా వచ్చాక కొందరు అతీగా ప్రవర్తిస్తున్నారు. ఒకప్పుడు తమ టాలెంట్ చూపించుకునేందుకు సరైన ప్లాట్ ఫామ్ దొరకలేదని భావించే వారు. కానీ ఇప్పుడు అలా కాదు. ఎవరికి వారు తమ టాలెంట్ ను వీడియోలు, రీల్స్ లు రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తున్నారు. దీంతో కొందరు ఓవర్ నైట్ లో స్టార్ లు అయిపోతున్నారు. కానీ కొందరు ఫెమస్ అవ్వాలని అతీగా ప్రవర్తిస్తున్నారు. దీంతో స్టార్ డమ్ రావడం దేవుడేరుగు.. కానీ అందరిలో నవ్వుల పాలౌతున్నారు. ఇటీవల కొందరు యువత మెట్రోలో డ్యాన్స్ లు చేయడం, రొమాన్స్ చేసుకొవడం, రన్నింగ్ బైక్ మీద స్టంట్ లు చేయడం వంటివి చేస్తున్నారు.