పుణె కారు ప్రమాదం ఘటన: మైనర్ ను విచారించేందకు జువైనెల్ బోర్డు అనుమతి 

పుణె కారు ప్రమాదం ఘటన: మైనర్ ను విచారించేందకు జువైనెల్ బోర్డు అనుమతి 

పుణె పోర్స్చే కారు ప్రమాద ఘటనలో నిందితుడైన మైనర్ ను విచారించేందుకు పోలీసులకు జువైనెల్ జస్టిస్ బోర్డు అనుమతిచ్చింది. నిర్లక్ష్యంగా, అతివేగంతో కారు నడిపి ఇద్దరి మృతి కారణమైన నిందితుడైన మైనర్ ను రెండు గంటల పాటు విచారించేందుకు శుక్రవారం (మే31) పుణె పోలీసులకు జువైనెల్ జస్టిస్ బోర్డు అనుమతి మంజూరు చేసినట్లు పోలీసు అధికారి చెప్పారు. 

మరోవైపు ఈ కేసుకు సంబంధించి స్థానిక కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో మైనర్ కారు డ్రైవర్ కనిపించకుండా పోవడంతో డ్రైవర్ అదృశ్యంపై మైనర్ తండ్రి, తాత పాత్రమై విచారించేందుకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి రిమాండ్ విధించింది కోర్టు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మే 19న పుణెలోని కళ్యాణి నగర్ లో ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లను లగ్జరీ కారుతో ఢీకొడ్డంతో అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాద సమయంలో కారులో బాల నేరస్థుడితోపాటు డ్రైవర్ కూడా ఉన్నాడు. అతడిని కిడ్నాప్ చేసి అక్రమంగా బంధించారని మైనర్ తండ్రి, తాతలపై ఆరోపణలు ఉన్నాయి.  వడ్గావ్ శేరీ ప్రాంతంలో నిందితుడి బంగ్లా లో సర్వెంట్ క్వార్టర్ నుంచి డ్రైవర్ అతడి భార్యను విడిపించారు పోలీసులు. 

 ఈ కేసులో మైనర్ తండ్రి, తాత పాత్రపై వారిని విచారించేందుకు కస్టడీ ఇవ్వాలని పోలీసుల తరపు న్యాయవాది కోరారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి నిందితుతులను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపారు.