పూణే కారు ప్రమాదంలో రోజుకో ట్విస్ట్

పూణే కారు ప్రమాదంలో రోజుకో ట్విస్ట్

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పుణె పోర్స్చే కారు ప్రమాదంలో సినిమా రేంజ్ లో రోజుకో  కొత్త ట్విస్ట్ బయటపడుతుంది. ఈ యాక్సిడెంట్ గురించి కంట్రోల్ రూంకు సమాచారం అందించనందుకు శుక్రవారం(మే24) ఇద్దరు పోలీసులు సస్పెండ్ అయ్యారు. డ్రైవర్ పై ఆ నింద మోపడానికి మైనర్ బాలుడి తాత ప్రయత్నించాడని తెలుస్తోంది. ఆయన డ్రైవర్ ఫొన్ తీసుకొని ఇంట్లో నిర్భందించారు. ప్రమాదం గురించి వైర్లైస్ కంట్రోల్రూమ్కు సమాచారం ఇవ్వలేదన్న కారణంగా పోలీస్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్లను సస్పెండ్ చేశారు. కారును రియల్టర్ విశాల్ అగర్వాల్ కుమారుడు నడపలేదన్నట్లుగా చిత్రీకరించేందుకు సాక్ష్యాల చెరిపివేతకు ప్రయత్నం జరిగిందని పుణె పోలీసు కమిషనర్ చెప్పారు. 

కారు నడిపింది ఆ పిల్లాడే, డ్రైవింగ్ కు ముందు మద్యం కూడా సేవించాడని పోలీసుల దగ్గర దానికి వాటి సీసీ టీవీ ఫుటేజ్ ఉందని పోలీసులు చెబుతున్నారు. అలాగే బాలుడి తాత డ్రైవర్ ను కిడ్నాప్ చేశాడని, యాక్సిడెంట్ తానే చేసినట్లు ఓప్పుకోమని డ్రైవర్ ను చిత్రహింసలు పెట్టారని కారు డ్రైవర్ పోలీసులకు చెప్పాడు. ఆ స్టేట్ మెంట్ తో బాలుడి తాను పోలీసులు అరెస్ట్ చేశారు. యువకుడి తాత, తండ్రి డ్రైవర్ ఫోన్‌ను తీసుకున్నారని ఆరోపించారు, మే 19 నుండి మే 20 వరకు వారి బంగ్లా ఆవరణలోని అతని ఇంట్లో అతనిని నిర్బంధించారు. డ్రైవర్‌ను అతని భార్య విడుదల చేసిందని క్రైమ్ బ్రాంచ్‌కు చెందిన ఒక అధికారి తెలిపారు.